క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

ముంబై:క్రిప్టో కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆర్థిక వ్యవస్థలకు క్రిప్టో కరెన్సీతో స్పష్టమైన ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.దేశ ఆర్థిక భద్రతకు క్రిప్టో కరెన్సీ మంచిది కాదని తేల్చి చెప్పారు.సురక్షితం కాదని తెలిసినా కొందరు క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టడం పట్ల శక్తికాంత దాస్ ఆందోళ న వ్యక్తం చేశారు.ఇటీవల అంతర్జాతీయ అనిశ్చితితో క్రిప్టో కరెన్సీ విలువ భారీగా పడిపోతున్న తరుణంలో ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.”క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక వ్యవస్థ లకు ముప్పు పొంచి ఉంది.అధునాతన పేరుతో వదంతుల మధ్య క్రిప్టో కరెన్సీలు దూసుకెళ్తాయి.రోజురోజుకు ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ పెరిగిపోతోంది.ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ పెరిగిన కొద్దీ సైబర్ ముప్పు పెరుగుతుంది.వాటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం,అంతర్జాతీయ ఒడిదొడుకుల మధ్య ఆర్థిక వ్యవస్థ అదుపు తప్పుతుంది.ఈ పరిస్థితుల్లో జాతీయ,అంతర్జా తీయంగా భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వెతకాల్సి ఉంది” అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.సరైన పద్ధతి లేకుండానే ఒక ఆస్తి విలువను ఊహాజనితంగా నిర్ధారించడం జూదం వంటిదే అని ఆయన అన్నారు.వివిధ వాటాదారులు,సంస్థల నుండి ఇన్‌పుట్లను సేకరించిన తర్వాత క్రిప్టో కరెన్సీపై సరైన వైఖరిని ఖరారు చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉందని తెలి పారు.ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు,భౌగోళిక రాజకీయ ప్రభావంతో తలెత్తే యుద్ధాలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు శక్తికాంత దాస్.అంతేకాదు అనుకోని ఉపద్రవాలను,ప్రమాదాల ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కరోనా అనంతరం పునరుజ్జీవన బాటలో ఉందని వెల్లడించారు.,క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు మదుపు చేయడం పట్ల ఆయన తరుచుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here