కోల్‌కతా:పశ్చిమబెంగాల్ సీఎంగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు.రాజ్‌భవన్‌లో గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కడ్ ఆమెతో సీఎం గా ప్రమాణస్వీకారం చేయించారు.కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది.కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.ఆదివారం వె లువడిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.292 స్థానాలకు గాను ఏకంగా 213 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు జయ కేతనం ఎగురవేశారు.భాజపా 77 స్థానాలకే పరిమితమైంది.దీంతో మూడోసారి మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణం చేశారు.దీదీ పోటీ ఎక్కడి నుంచి?నందిగ్రామ్‌లో ప రాజయం పాలైనప్పటికీ మమతా బెనర్జీ సీఎం పీఠాన్ని అధిరోహించారు.అక్కడ శాసన మండలి లేకపోవడంతో పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఆమె తప్పని సరిగా రాష్ట్రంలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం మూడు సీట్లపై అందరి దృష్టి నెలకొంది.ఉత్తర 24 పర గణాల జిల్లాలోని ఖర్దాహా స్థానానికి గత నెల 22న పోలింగ్ జరిగింది.అక్కడ తృణమూల్ తరఫున పోటీ చేసిన కాజల్ సిన్హా గెలుపొందారు.అయితే కొవిడ్ దెబ్బకు సి న్హా గత నెల 25నే మృతిచెందారు.దీంతో అక్కడ ఉప ఎన్నిక తప్పనిసరి.మరోవైపు-ఆర్‌ఎస్‌పీ అభ్యర్థి మరణించడంతో జంగీపుర్,కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూయడంతో శంషేర్‌గంజ్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.ఈ మూడింటిలో ఏదో ఒకదాన్నుంచి మమత పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.దీదీ ప్రస్థానం ఇదీ..ఆమె 1955 జనవరి 5న ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు.తల్లి గాయత్రీ దేవి.తండ్రి ప్రొమిలేశ్వర్ బెనర్జీ.ప్రొమిలేశ్వర్ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా వ్యవహ రించేవారు.ఆయన బాటలో కళాశాల విద్యార్థినిగా ఉన్నప్పుడే మమత కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో చేరారు.చిన్నప్పటి నుంచే ఆమె ఫైర్‌బ్రాండ్.మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని అభిమానించేవారు.1984లో జాదవ్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె కమ్యూనిస్టు దిగ్గజం సోమ్‌నాథ్ ఛటర్జీని ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు.అదే ఏడాది కాంగ్రెస్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.కాంగ్రెస్‌పై దేశవ్యాప్తంగా పెరిగిన వ్యతిరేకత ప్రభావంతో మమత 1989 ఎన్నికల్లో ఓడిపోయినా 1991లో మళ్లీ గెలిచారు.36 ఏళ్లకే కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.1997లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చారు.సొంతంగా తృణ మూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు.రాష్ట్రంలో కామ్రేడ్లను గద్దె దించడమే ఎజెండాగా పెట్టుకున్నారు.ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని,ఎట్టకేలకు తన లక్ష్యాన్ని 2011లో అం దుకున్నారు.ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలను మట్టికరిపించి,తొలిసారి సీఎం పీఠమెక్కారు.బెంగాల్‌కు తొలి మహిళా సీఎం ఆమే.పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని ప్రజా సేవకే దీదీ అంకితం చేశారు.
