బీసీలను కుల వృత్తులకే పరిమితం చేయాలనుకుంటున్న కేసీఆర్‌?వైఎస్ షర్మిల

నారాయణపేట:తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.బలహీన వర్గాలకు చెందిన వారు గొర్రెలు,బర్రెలు,చేప లు పెంచుకునే కుల వృత్తులకే పరిమితం కావాలా..? అని ప్రశ్నించారు.రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగడం లేదని అన్నారు.నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన బీసీల ఆత్మగౌ రవ సభలో పాల్గొని మాట్లాడారు.పాలకులే బీసీలను ఎదగకుండా చేస్తున్నారని కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు షర్మిల.వారిని ఇంకా కుల వృత్తులకే పరిమితం చేస్తున్నారని అన్నా రు.ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బీసీల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ ఏడేళ్లలో బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప బీసీలకు చేసిందేమిటని ప్రశ్నించారు.బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.బ్యాక్ బోన్ క్లాస్ అని షర్మిల అభివర్ణించారు.తాము అధికారంలోకి వస్తే ట్యాంక్ బండ్ పై బీసీ మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు.ప్రభుత్వ శాఖల్లో అనేక ఖాళీలు ఉ న్నాయని గుర్తు చేస్తూ బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాలని షర్మిల డిమాండ్ చేశారు.బీసీలు అంటే బ్యాక్వార్డు క్లాస్ కాదు.బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని ఆమె అన్నారు. బీసీలకు తమ పార్టీ ఆత్మగౌరవం కల్పిస్తుందన్నారు షర్మిల.సీఎం కేసీఆర్ బీసీలను ఎప్పుడు గౌరవించలేదని ఆమె విమర్శించారు.బీసీ కులాల వారు కుల వృత్తులకు మాత్రమే పరిమి తం కావాలా ?బర్రెలు,గొర్రెలు,చేపలు పెంచుకుని బతికేందుకు మాత్రమే పనికి వస్తారా..?అని ప్రశ్నించారు.కేసీఆర్ కుటుంబం ఆ పనులు చేయరు ఎందుకు..?అని ఆమె నిల దీశారు. బీసీలకు ఎన్నికోట్లు ఖర్చు చేశారో తెలపాలని డిమాండ్ చేశారు.బీసీల జనాభా లెక్కల్లో ఏ కులంలో ఎంత మంది ఉన్నారో తేల్చాలన్నారు.కేసీఆర్ సమగ్ర సర్వే పేరుతో కోట్ల రూపాయ లు ఖర్చు చేశారని మండిపడ్డారు.కేసీఆర్ కు ఎన్నికలప్పుడే బిసిలు గుర్తుకు వస్తారని,ఉద్యమంలో బీసీలను వాడుకుని చట్ట సభలలో వారికి అవకాశం ఇవ్వలేదన్నారు వైఎస్ షర్మిల. వైస్సార్ తెలంగాణ పార్టీ వస్తే అసంబ్లీ లో బీసీ లకు ప్రాధాన్యత ఇస్తామని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.ఈ సందర్భంగా తమ పార్టీ అధికారిక వెబ్సైట్.www.ysrtelangana. com ప్రారంభించారు.కాగా,త్వరలోనే షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here