ఒక్క ఈటల కోసం..తెలంగాణ ఖజానా ఖాళీ చేస్తున్న కేసీఆర్..?

హైదరాబాద్:హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం ఎలాగైనా సరే ఈ ఉపఎన్నిక గెలవాలి.ఈటలపై పైచేయి సాధించా లి.ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఓడిపోతే అతి కేసీఆర్‌కు అత్యంత పెద్ద అవమానంగా నిలుస్తుంది.కేసీఆర్ ఓ మంత్రిని అవినీతి పరుడుగా ముద్రవేసి బయటకు పంపిన త ర్వాత అతడు పార్టీకి రాజీనామా చేసి మళ్లీ మరో పార్టీ నుంచి గెలిస్తే అంతకు మించి అవమానం కేసీఆర్‌కు ఉంటుందా ఉండదు కాక ఉండదు.అందుకే ఇప్పుడు కేసీ ఆర్‌ ఈటల ఓటమి కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే స్థితిలో ఉన్నాడంటున్నారు విశ్లేషకులు.ఎన్నికలు వచ్చే ప్రాంతాల్లో హామీలు గుప్పించడం హడావిడిగా వా టిని అమలు చేయడం కేసీఆర్‌కు కొత్తేమీ కాదు.గతంలో హుజూర్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆయన ఇలాంటి ట్రిక్స్ చాలా ప్లే చేశాడు.కొన్నిసార్లు వర్కవుట్ అ య్యాయి.మరికొన్నిసార్లు కాలేదు.కానీ ఈసారి హుజూరాబాద్‌లో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేందుకు కేసీఆర్ సిద్ధంగా లేడు.ఈ విషయాన్ని ఆయన కౌ శిక్‌ రెడ్డి పార్టీలో చేరే రోజే నిక్కచ్చిగా చెప్పేశారు.జనాలను ఆకర్షించే పథకాలు బరాబర్ పెడతాం.రాజకీయ లబ్ది కోసం పథకాలు పెడతాం అందులో తప్పేముందని ఆ రోజే తేల్చి చెప్పేశారు కేసీఆర్.అంత వరకూ ఓకే కానీ ఆ హామీ పర్యవసానాలు కూడా చూడాలి కదా అంటున్నారు విశ్లేషకులు.దళిత బంధు పథకం కేవలం హుజూరా బాద్ ఎన్నికల కోసం తెచ్చిందే అని చాలా మంది నమ్ముతున్నారు.అందులో పెద్దగా అనుమానపడాల్సిందేమీ లేదు.హుజూరాబాద్‌లో దళితులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల వారి ఓట్ల కోసం ఇలాంటి వేల కోట్లు ఖర్చయ్యే పథకాలు తీసుకొస్తున్నారన్న విషయం కూడా రహస్యమేమీ కాదు.కానీ దేనికైనా హద్దు ఉంటుంది కదా కేవలం ఒక ఉపఎన్నిక కోసం కేసీఆర్ తెలంగాణ ఖజానా ఖాళీ అయ్యేలా పథకాలు తీసుకొస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.మరి హుజూరాబాద్‌లో ఓటమి గురించే కేసీఆర్ నిజంగానే అంతగా భయపడుతున్నారా అందుకే ఇలా సర్కారు సొమ్ముతో ఓట్లు కొనే ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవునని చెప్పక తప్ప దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here