కాంగ్రెస్‌ పార్టీకి కౌశిక్‌ రెడ్డి రాజీనామా

హైదరాబాద్:చాలా బాధతో రాజీనామా నిర్ణయం తీసుకున్నానని హుజురాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి,టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.హుజురాబాద్‌ టికె ట్‌ తనకే వస్తుందని ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించడంతో పార్టీ ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.24 గంటల్లో వివరణ ఇవ్వా లని తెలిపింది.పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదు లు వచ్చాయి.దీంతో కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి,పీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు.అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఎంతో బాధ తో రాజీనామా నిర్ణయం తీసుకున్నా.రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్న వారిలో నేను మొదటివాడిని.రూ.50కోట్లు ఇచ్చి రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షు డు అయ్యారు.హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ గెలవదన్న రేవంత్‌ వ్యాఖ్యలు బాధాకరం.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భ్రమల్లో ఉన్నారు అని కౌశిక్‌ విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here