ఔను నిజమే..అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్‌

0
629

న్యూయార్క్:అమెరికాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.’ఒకేఒక్కడు’ సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది.ఇలానే అమెరికాలో కూడా కొంత సమ యం పాటు ఆ దేశానికి అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు దక్కింది.శుక్రవారం ఉదయం 10.10 నిమిషాల నుంచి 11.35 నిమిషాల వరకూ కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు.కొనసాగింది కొంతసేపే అయినప్పటికీ అమెరికా దేశానికి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తొలి మహిళగా కమలా హారి స్‌ చరిత్ర సృష్టించారు.అయితే ఈ అధికార బదిలీకి కారణం ఉంది.అమెరికాకు 42వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ నవంబర్ 20న శనివారం తన 79వ పుట్టినరోజు జరుపుకోనున్నా రు.ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధ వహించే జో బైడెన్ శుక్రవారం ఉదయం వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఇందులో భాగంగా ఆయనకు కొలనోస్కోపీ నిర్వహించారు.కొలనోస్కోపీ చేసిన సందర్భంలో మత్తు ఇవ్వాల్సి ఉంటుంది.ఈ వైద్య పరీక్షలు పూర్తయ్యే సరికి కొంత సమయం పడుతుందని తెలుసుకున్న జో బైడెన్ తన అధ్యక్ష బాధ్యతలను ఆ సమయం వర కూ కమలా హారిస్‌కు అప్పగించారు.తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన కమలా హారిస్ ఆ సమయంలో వైట్‌హౌస్‌లోని వెస్ట్ వింగ్‌లో ఉన్న తన కార్యాలయం నుంచే పని చేశారు.250 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఒక మహిళ అధ్యక్షురాలిగా కొనసాగిన దాఖలాలు లేవు.ఈ రికార్డ్ తాజాగా కమలా హారిస్‌కు దక్కింది.అంతేకాదు అమెరికా తొలి మహి ళా ఉపాధ్యక్షురాలిగా కూడా కమలా హారిస్ పేరిట ఇప్పటికే రికార్డు ఉంది.అమెరికా రాజ్యాంగంలోని 25వ అధికరణ ప్రకారం అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతలు నిర్వహించే పరిస్థితి లో లేకపోతే తన అధికారాలను మరొకరికి బదిలీ చేసే అవకాశం ఉంది.రాజ్యాంగబద్ధంగానే ఆ కొంత సమయం పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా హారిస్ కొనసాగారు.అమెరికాలో గతంలో కూడా ఇలా జరిగింది.జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో 2002,2007లో ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తికి అధ్యక్ష అధికారాలు దక్కాయి.అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆయనకు ప్రైమరీ కేర్ ఫిజీషియన్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ కెవిన్ ఓ’కానర్ చెప్పారు.2009 నుంచి జో బిడెన్‌కు కెవిన్ వైద్యుడిగా కొనసాగుతున్నారు.జో బైడెన్ కొన్ని సందర్భాల్లో ఒక రకమైన క్రమ రహిత హృదయ స్పందన కారణంగా ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్య ఆందోళనకరం అయిన ప్పటికీ చికిత్స ద్వారా పరిష్కరించవచ్చని కంగారు పడాల్సిన పనేమీ లేదని కెవిన్ తెలిపారు.మేరీలాండ్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్‌లో జో బైడెన్‌కు వైద్య పరీక్ష లు నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here