హుజురాబాద్ లో టీఆర్‌ఎస్‌ వ్యూహం బెడిసికొట్టిందా..?


హైదరాబాద్:పాడి కౌశిక్‌రెడ్డి ఆడియో లీక్‌ కావడంతో టీఆర్‌ఎస్‌ వ్యూహం బెడిసి కొట్టిందన్న ప్రచారం జరుగుతోంది.టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వానికి సంబంధించి ఎన్ని పేర్లు తెరపైకి వచ్చినా అవన్నీ తేలిపోయాయి.గతంలోనూ కాంగ్రెస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జోరుగా సాగింది.టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వం ద్వి ముఖ వ్యూహంతో పాడి కౌశిక్‌రెడ్డి ని వినియోగించుకోవాలని భావించినట్లు రాజకీయ పరిశీలకులు భావించారు.టీపీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌కు పాడి కౌశిక్‌రెడ్డి సమీప బంధువు కావడం గమనార్హం.ఉత్తమ్‌ టీపీసీసీ చీఫ్‌గా కొనసాగితే కాంగ్రెస్‌ టికెట్‌ ‘పాడి’కి ఖరారు చేశాక ఆయన్ను చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రంగంలోకి దింపి కాంగ్రెస్‌కు షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చి కాంగ్రెస్‌ ఓటింగ్‌ను తమవైపు తిప్పుకోవడమే కాకుండా కాంగ్రెస్‌కు అభ్యర్థి దొరక్కుండా చేయాలని టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం భావించిందన్న ప్రచారం జరుగుతోంది.ఆకస్మికంగా టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రంగప్రవేశం చేయడంతో సీన్‌ మారింది.పాడి కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్‌ టికెట్‌ ఖరారుపై అను మానాలు వ్యక్తం కావడం రేవంత్‌ అభిప్రాయాలు భిన్నంగా ఉండడంతో ఇక ఒక స్పష్టనిచ్చే క్రమంలో పాడి కౌశిక్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ ముఖ్యుడు గ్రీన్‌సిగల్‌ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే పాడి కౌశిక్‌రెడ్డి బీజేపీ కార్యకర్త విజేందర్‌తో ఫోన్‌ సంభాషణ జరపగా అది లీక్‌ కావడంతో ఇటు పాడి కౌశిక్‌రెడ్డి ఇరుకున పడడమే కా కుండా టీఆర్‌ఎస్‌ వ్యూహం బెడిసి కొట్టినట్టయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here