సిద్దిపేట:ఇద్దరు యువకులు బావిలో శవాలుగా తేలిన ఘటన బుధవారం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ శివారు లోని బుగ్గ బావిలో ఉదయం ఈత కోసం వెళ్లిన కొందరు వ్యక్తులు బావిలో పడి ఉన్న ఇద్దరు యువకుల శవాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు.మృత దేహాలను బావిలోని చేపలు,క్రిమికీటకాలు తినడంతో మృత దేహాలు గుర్తు పట్టకుండా ఉన్నాయి.పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు.రూరల్ ఎస్ ఐ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ గుర్తు తెలియని శవాలుగా కేసు నమోదు చేసి,ఆత్మహత్యా లేదా హత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టి నట్లు తెలిపారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ మార్చరికి తరలించినట్లు వెల్లడించారు.మృతదేహాల కోసం వారి బంధువులు ఎవరైనా ఉంటే రూరల్ పోలీసులను సంప్రదించాలని వా రు కోరారు.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...