కొన్నిచోట్ల ఇవాళ,మరొకొన్ని చోట్ల రేపు..సద్దుల బతుకమ్మ

0
404

హైదరాబాద్‌:సద్దుల బతుకమ్మ పండుగ ఈరోజే ఇవాళ్టితో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి.సంప్రదాయం ప్రకారం దుర్గాష్టమి రోజునే సద్దుల బతుకమ్మ జరుపుకోనున్నారు. బతుకమ్మ పండుగతో తెలంగాణ అంతటా కోలాహలం నెలకొంది.ఎంగిల పూలతో సంబురం మొదలైంది.ఆడపడుచులు తీరొక్క పూలతో వీధివీధిన బతుకమ్మను కొలుస్తున్నారు.తొమ్మి ది రోజులు తొమ్మిది రూపాల్లో ఆ అమ్మవారిని పూజిస్తారు.చివరి రోజైన సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి.సద్దుల బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా తొమ్మిది రోజు,మరికొన్ని ప్రాంతాల్లో 11రోజులు,13 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితిగా వస్తోంది.ఇదిలావుంటే ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడతోపాటు కొండపాకలో ఏడు రోజులపాటు ఆడతారు.అయితే ప్రభుత్వ పరంగా మాత్రం బుధవారమే సద్దుల పండుగను నిర్వహిస్తున్నారు.ఇదిలావుంటే హైదరాబాద్‌లో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ ము గింపు ఉత్సవాలు జరగనున్నాయి.ఆయా జిల్లాల్లో పరిస్థితులకు అనుగుణంగా ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆడ పడుచులు,మహిళా కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.ఇక తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకపై హాట్‌ టాపిక్‌ నడిచింది.వాస్తవానికి దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు.కానీ,ఈ ఏడాది మాత్రం గందరగోళం నెలకొంది.వేద పండితుల మధ్య చర్చోపచర్చలు జరిగాయి.చివరకు ఈ నెల 13 అంటే ఈరోజు సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని ప్రకటించారు.మరోవైపు రాష్ట్ర సర్కార్ ఈరోజే సద్దుల బతుకమ్మ పండుగ అని ఖరారు చేసింది.తీరొక్కపూలతో ముస్తాబయ్యే బతుకమ్మల సందడి తెలంగాణ అంతటా కనిపించింది.ఈ రో జు సద్దుల బతుకమ్మ రేపు నవమి వేడుకలు తర్వాతి రోజు విజయదశమి సంబరాలతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here