హరీశ్..ఇంత దిగజారుడు తనమా?

0
455

హుజూరాబాద్:హుజూరాబాద్ ఉపఎన్నికల జరగనున్న క్రమంలో టీఆర్ఎస్,బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.ముఖ్యంగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు,మాజీ మంత్రి ఈటల రాజేందర్‌లు పరస్పర విమర్శలు చేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.హరీశ్ రావుకు మతిభ్రమించిందని అందుకే ఇష్టానుసారం అబ ద్ధాలు చెబుతున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు.హరీశ్ రావుకు ఈటల రాజేందర్ సవాల్ హుజూరాబాద్‌లో బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెం కటస్వామి,ఇతర పార్టీ నేతలతో కలిసి ఈటల రాజేందర్ గురువారం మీడియాతో మాట్లాడారు.హరీశ్ రావు మాట్లాడే ప్రతి మాత వ్యంగ్యంగా,అసత్యాలతో కూడినవిగా ఉన్నాయన్నారు.ఇతరుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.హుజూరాబాద్‌లో అభివృద్ధి జరగలేదని చేస్తున్న అసత్య ప్రచారాల పై చర్చకు సిద్ధంగా ఉన్నారా? అని హరీశ్ రావుకు సవాల్ విసిరారు ఈటల రాజేందర్.ఉన్నతమైన స్థానంలో ఉన్న హరీశ్ రావు దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజ మెత్తారు.ఇలానే విచక్షణ కోల్పోయి మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటారని అన్నారు.డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారని హుజూరాబాద్‌లో త న వెంట వస్తే ఎక్కడ కట్టించానో చూపిస్తానని ఈటల రాజేందర్ తెలిపారు.హుజూరాబాద్,జమ్మికుంట,కమలాపూర్‌లో 500 ఇళ్లు చొప్పున కట్టించినట్లు చెప్పారు.సీ ఎం కేసీఆర్,కేటీఆర్,హరీశ్ రావు,కవిత,సంతోష్ రావు ఈ రాష్ట్రం తమదేనని,తామే సాధించామని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.కేటీఆర్,హరీశ్ రావు,కేసీ ఆర్ ప్రాతినిథ్యం వహించే సిరిసిల్ల,సిద్దిపేట,గజ్వేల్ మధ్యనున్న దుబ్బాకలో రోడ్లు వేశారా? డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టారా? అందుకే అక్కడ ప్రజలు టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పారన్నారు.హుజూరాబాద్‌లో కూడా టీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదని ఈటల వ్యాఖ్యానించారు.తన మీద చేసిన ఆరోపణలపై చర్చకు తాను సిద్ధమని చర్చించేం దుకు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు రావాలని ఈటల సవాల్ విసిరారు.ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు తానే చేస్తానని చెప్పారు.హరీశ్ రావు ఓ తోపు అని అనుకుంటున్నారా? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.హరీశ్ రావు నిర్వాకంపై ప్రజలు చీదరించుకుంటున్నారని,హుజురాబాద్‌లో హరీశ్ నడిచే రోడ్లు ఎవరు వే శారని ఆయన నిలదీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here