బీజేపీకి..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా

హైదరాబాద్:బీజేపీకి ఆ పార్టీకి సీనియర్ నేత,మాజీ మంత్రి ఇనుగల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు.ఈమేరకు రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపారు.హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పెద్దిరెడ్డి మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీలో చేరికను ఆయన వ్యతిరేకించారు.రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉండగా అప్పటి నుండే బీజేపీలో ఇమడలేకపోతున్నామనే భావనలో పెద్దిరెడ్డి ఉన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపించింది.ఈ టల చేరిన సమయం నుండే పెద్దిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తుండగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది. చివరికి ఆయన పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు.పెద్దిరెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పని చేయగా టీడీపీలో ఉన్నంత కాలం కరీంనగర్ జిల్లాలో ఆయ న బలమైన నాయకుడిగా ఒక వెలుగు వెలిగారు.తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థంగా మారిన నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరగా ఈటల కమలం గూటికి చేరడంతో పెద్దిరెడ్డి కినుకు వహించినట్లుగా కనిపించింది.ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే తాను మద్దతు ఇవ్వనని పెద్దిరెడ్డి అప్పుడే ప్రకటించగా ఈటల పార్టీలో చేరడంపై తనను ఎవరు సంప్రదించలేదని అసహనం వ్యక్తం చేశారు.చివరికి సోమవారం బీజేపీకి గుడ్ బై చెప్పారు.అయితే పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం కరీంనగర్‌ రాజకీయా ల్లో చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here