ఇవాళ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన

0
403

కరీంనగర్:హుజూరాబాద్‌ బైపోల్‌ పాలిటిక్స్‌ హీటెక్కాయి.పీఠం నీదా..నాదా..? సై అంటే సై అంటున్నారు అభ్యర్థులు.జోరుగా క్యాంపెయిన్‌ చేస్తున్నారు.పదునైన మాటలతో ప్రత్యర్థుల్లో గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు.మొత్తం 61 మంది నామినేషన్స్‌ దాఖలు చేశారు.ఇవాళ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు.ఐతే పలువురు ఇండిపెండెంట్స్‌ సరైన పత్రాలు లేకుండా నామినేషన్స్‌ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.దీంతో ఎంతమంది బరిలో ఉంటారు..? ఎంతమంది డిస్‌ క్వాలిఫై అవుతారన్నది తేలిపో తుంది.పలువురు ఇండిపెండెంట్స్‌ సరైన పత్రాలు లేకుండా నామినేషన్స్‌ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.దీంతో ఎంతమంది బరిలో ఉంటారు..? ఎంతమంది డిస్‌ క్వాలిఫై అవుతారన్నది తేలిపోతుంది.భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.మొత్తం 61మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.చివరి రోజైన నిన్న 46మంది నామినేషన్ పత్రాలను సమర్పించారు.వీ రంతా బరిలో ఉంటే ఈవీఎంలు పెరగనున్నాయి.ఇవాళ నామినేషన్ల పరిశీలన13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.హుజూరాబాద్‌లో రాజేందర్‌ పేరుతో నలుగురు నామినేషన్లు దా ఖలు చేశారు.బీజేపీ తరపున బరిలో ఈటల రాజేందర్‌ బరిలో ఉండగా చివరి రోజున రాజేందర్‌ పేరుతో మరో ముగ్గురు నామినేషన్లు వేశారు.వీరందరి ఇంటి పేరు కూడా ఈ అనే అక్షరం తోనే ప్రారంభమైంది.ఇమ్మడి రాజేందర్‌,ఈసంపల్లి రాజేందర్‌,ఇప్పలపల్లి రాజేందర్‌ తమ నామినేషన్లు వేశారు.ఐతే ఓటర్లను కన్‌ఫ్యూజ్‌ చేసి గందరగోళానికి గురిచేసేందుకే టీఆర్‌ఎస్‌ ఇ లాంటి నామినేషన్స్‌ వేయించిందని ఆరోపిస్తోంది బీజేపీ.ఇక గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 13 మంది హుజూరాబాద్‌ బైపోల్‌ ఫైట్‌లో ఉండగా 43మంది ఇండిపెండెంట్లతో పాటు మొత్తం 61 మంది 92 సెట్ల నామినేషన్స్‌ వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here