కాంగ్రెస్,బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్దాలే:మంత్రి హరీష్ రావు

హైదరాబాద్:కాంగ్రెస్,బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్దాలేనని తెలిపారు మంత్రి హరీష్ రావు.ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో మాట్లాడిన హరీష్‌.కేంద్రం విడుదల చేసిన గణాంకాల ఆధారంగా ఆర్థిక శాఖ లెక్కలు చూపిస్తున్నామన్నారు.కేంద్రంమంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర పేరుతో అవాస్తవాలు మాట్లాడుతున్నారు.టీపీసీసీ అధ్యక్షుడు ప్రజ లను మోసం చేసే విదంగా అబద్ధాలు చెప్తున్నారన్నారు.దేశంలో ఒక్క గ్రోత్ తో తెలంగాణ గ్రోత్ పోల్చితే రాష్ట్రంది డబుల్ అయింది.దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం లో-మొత్తం దేశంలో మూడో స్థానంలో ఉన్నాము.2014 లో తెలంగాణ జిడిపి 4.06శాతం ఉంటే-2021కి వచ్చే సరికి 4.97శాతం కు పెరిగిందన్నారు.దేశానికి ఇ చ్చే జీడీపీలో తెలంగాణ రాష్ట్రం 6వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నాము.దేశం వృద్ధి రేటుతో తెలంగాణ పోల్చితే పెరుగుతూ పోతుందన్నారు.తెలంగాణ రాష్ట్రం ఆరు ఏళ్లుగా 11.7 వృద్ధి రేటు ఉంటే.దేశం 8.7 మాత్రమే ఉంది.భారతదేశ ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉంది మోడీ సాధించిన ఘనత బంగ్లాదేశ్ కంటే ఆర్థిక పరిస్థితి ని దిగజార్చారన్నారు.దేశాన్ని గొప్పగా బీజేపీ నడిపితే వృద్ధిలో బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఎందుకు ఉంది?గడిచిన ఆరేళ్ల వృద్ధి రేటుతో తెలంగాణ నెంబర్ వన్ స్థానం లో ఉందన్నారు.పర్కాపిటి ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో ఉన్నాము-రాష్ట్రం ఏర్పడినప్పుడు 7వ స్థానంలో ఉన్నాము.దేశం పర్కాపిటి ఇన్కమ్ ఆరేళ్ల లో 48 శాతం ఉంటే-తెలంగాణ రాష్ట్రంది 91.5శాతంగా ఉంది.తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రం సంపద పెరిగింది-ప్రజల ఇన్కమ్ కూడా పెరిగిందన్నారు.గడిచిన ఆరేళ్లలో పర్కాపిటి ఇన్కమ్ దేశంలో 7శాతం ఉంటే-తెలంగాణ రాష్ట్రానిది 11.5 శాతంగా ఉన్నాము.వ్యవసాయ రంగం తెలంగాణ వృద్ధికి చాలా ఉపయోగపడిందన్నా రు.కరోనా సమయంలో కూడా తెలంగాణ వృద్ధి ఆగలేదు దేశం వృద్ధి చాలా డిలా పడింది.సౌత్ ఇండియా లో ఙస్దప్-పేర కాపిటల్ లో తెలంగాణ నెంబర్ వన్ గా గడి చిన ఆరేళ్లుగా ఉన్నామన్నారు.2014 నుంచి 2021 వరకు రెవెన్యూ కలెక్షన్స్ లో 90శాతం సక్సెస్ అయ్యాము.రాష్ట్ర సొంత రెవెన్యూ లెక్కల్లో దేశంలోనే ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉంది.ప్రాజెక్టులు-గొర్రెల పంపిణీ వల్ల రాష్ట్ర ఉత్పత్తికి ఎంతో తోడ్పడింది.టాక్స్ కలెక్షన్స్ లో 11.52 శాతంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉం దన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here