హుజురాబాద్:టీఆర్ఎస్ లో అంతా స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ బాంబు పేల్చారు.రాసిచ్చింది మాట్లాడడం తప్ప సొంతంగా మాట్లా డే అధికారం ఎవ్వరికీ లేదని హాట్ విమర్శలు చేశారు.మంగళవారం ఈటల విలేకరులతో మాట్లాడారు.20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీలో చాలా చూశానని అందరి లిస్ట్ నా దగ్గరి ఉందని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.మంత్రులుగా కాకుండా మనుషులుగా మాట్లాడాలని హితవు పలికారు.కనీసం ఆ మంత్రులకు అయినా ఇక నుంచి కేసీఆర్ గౌరవం ఇవ్వాలని కోరుతున్నానని ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నానని ఈటల రాజేందర్ అన్నారు.ఇక టీఆర్ఎస్ లోని ఎవ్వరి గురించి తాను కా మెంట్ చేయనని ఈటల చెప్పుకొచ్చారు.నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చింది టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేయలేదని అన్నారు.మంత్రి కేటీఆర్ సీఎం అభ్యర్థిత్వాన్ని తాను వ్యతిరేకించలేదని అన్నారు.కేటీఆర్ సీఎం కావాలని స్వాగతించానని అన్నారు.నాపై కక్ష సాధించడం సరికాదని ఎవరి మాటలపై స్పందించను అని నాతో ఎవరేం మాట్లాడారో తెలుసు అంటూ ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.
Latest article
ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..
హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...
ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు
న్యూఢీల్లి:ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కో సం ముందస్తుగానే...
అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు
హైదరాబాద్:తెలంగాణలోని హైదరాబాద్లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...