అది అక్రమ డబ్బే తీసుకోండి..వోటు మాత్రం నాకు వేయండి:ప్రతి పేద కుటుంబానికి 10 లక్షల రూపాయలు..నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్:ఈటల

జమ్మికుంట:కెసిఆర్ కుటుంబం కూలికి పోయి డబ్బులు తెచ్చి ఇవ్వడం లేదు మన డబ్బులే మనకు పంచిపెడుతున్నారు.ఏమిచ్చినా తీసుకోండి వోటు మాత్రం నాకు వేయండి.నా రాజీనామా తోనే సిఎం కెసిఆర్ అడుగు బయట పెట్టినడు.నా రాజీనామా వల్ల 57 సంవత్సరాలకే పెన్షన వస్తుంది.నా రాజీనామా వల్లనే స్కూల్స్ లో క్యాంప్ లు పెట్టి మరీ సదరం సర్టిఫికేట్ లు ఇస్తున్నారు.చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అప్పటి వరకు 3116/-నిరుద్యోగ బృతి కూడా వెంటనే ఇవ్వకి అని కెసిఆర్ని డిమాండ్ చేస్తున్నా.దళితబందు ఇవ్వండి కానీ వారితో పాటు అవసలోళ్ల,కంచరోళ్ళు,కుమ్మరోళ్ళు,విశ్వకర్మలు,వడ్లవాళ్ళు,కం సాలి,శిల్పులేకాదు కడు బీదరికం అనుభవిస్తున్న ప్రతి పేద కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న.తిండికి లేక ఇబ్బంది పడేవాళ్ళు ప్ర తి ఒక్కరినీ ఆదుకోవాలి.ఆర్దిక మంత్రిగా అయిన తరువాత చేనేత కార్మికులతో మీటింగ్ పెట్టించి వారికి ప్రభత్వం ఉన్న బాకయీలు అన్నీ చెల్లించే ఏర్పాటు చేశాను. కాని ఇప్పుడు వారిని పట్టించుకొనే వారే లేరు.సిఎం కు నిజంగా పేదలు అంటే ప్రేమ ఉంటే,పేదల జీవితాలు బాగుచేయాలని మీకు ఉంటే హుజూరాబాద్ ఎన్నికలలో పే రాష్ట్రం లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి పది లక్షల రూపాయలు అందించాలి.పది మందికి ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఆశ పెట్టవద్దు.ఆశలు అడియాశలు కానివ్వ వవద్దు.ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలి.నా పక్కన ఉన్న వాళ్ళందరినీ కెసిఆర్ కొనిపడేశాడు.ఆపద వచ్చినప్పుడు అండగా ఉండాల్సిన వారు అమ్ముడు పోయి మోసం చేశారు.నీచం.వాళ్ళందరినీ ప్రజలు అర్దం చేసుకున్నారు.మనుషులకు వెలగట్టి నాయకులని కొనవచ్చు కానీ ప్రజలను కొనలేరు.కెసిఆర్ అక్రమంగా సంపాదిం చిన డబ్బు తీసుకువచ్చి ఇక్కడ పంచిపెట్టవచ్చు,ఒక్కొక్కరికీ 10 వేలు ఇస్తారట తీసుకోండి,కానీ వోటు మాత్రం నాకు వెయ్యండి.నేను మీ బిడ్డను మీ కళ్ళల్లో కదలా డేవాడను పైసల కోసం కాకుండా మీ కోసం ఉండేవాడికి వోటు వేయండి.పెన్షన్,రేషన్ కార్డ్,రేపు ఎన్నికల అప్పుడు ఇచ్చే డబ్బులు కెసిఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తలేదు,కెసి ఆర్ కుటుంబం కూలికి పోయి డబ్బులు తెచ్చి ఇవ్వడం లేదు.మన చెమట పైసలే మనకు పంచి పెడుతున్నారు.హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ది చూసి ఇ క్కడికి వచ్చిన నాయకులే ఆచ్చర్య పోతున్నారు.కానీ ఒంటరి మహిళలు,కడు బీద వారి కోసం ఏం చేయాలి అని ఆలోచన చేసి అధికారులు,బ్యాంకర్స్ తో కలిపి స మావేశం ఏర్పాటు చేసి దాదాపు వెయ్యి మందికి ఉపాది కలిపించా,సొంతంగా ఐదు వందల కుట్టు మిషన్లు తెచ్చిపేద మహిళలకు పంచిపెట్టిన కానే ఈ లోగా ఎన్నిక వచ్చి అది అక్కడితో ఆగిపోయింది.కేంద్రం ఆద్వర్యంలో అనేక స్కీమ్ లు ఉన్నాయి.వాటిని తీసుకు వచ్చి హుజూరాబాద్ మహిళలకు అందిస్తా.జమ్మికుంట ఒక నాడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది చూడండి.ఉద్యమంలో ఉన్నంత కాలం మీరు నాకుఅందించిన సహకారం మరువలేనిది.48 గంటల పాటు రైల్ పట్టాల మీద పడు కొని,పోలీసులు గోడ్లనిబాదినట్టు బాదినా కూడా తట్టుకొని ఉద్యమం చేసినం.గాంధీ చౌరస్తాలో వందల రోజులు నిరసన దీక్ష చేసినం.కర్రెర్రబడగానే కన్నెర్రబడ్డట్టుగా సిఎం గారికి ఎందుకు కల్లమంట వచ్చిందో ఎందుకు దూరం చేసుకోవాలి అనిపించిందో దూరం చేసుకున్నాడు.నన్ను వెల్లగొట్టినడు.మనల్ని కొట్టిన వాళ్ళని,తిట్టిన వాళ్ళకి, ఉద్యమ ద్రోహులకు పదవులు ఇస్తుండు.దిక్కు లేని నాడు బాసటగా ఉన్న వాన్ని వందల కేసులు పెట్టినా,జైల్లో పెట్టినా,ప్రలోభ పెట్టాలని చూ సినా లొంగని వాళ్ళని బయటికి పంపారు.ఇవన్నీ గమనిస్తున్న ప్రజలారా ధర్మాన్ని గెలిపించండి అని ఈటల రాజేందర్ అన్నారు.జమ్మికుంట లోని తన నివాసంలో కొత్తపల్లికి చెందిన ఐదు వందల మంది బిజేపి లో చేరిన సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఎన్నికల బిజేపి ఇంచార్జ్ మాజీ ఎంపి జితేందర్ రెడ్డి,జ మ్మికుంట మండల బిజేపి అద్యక్షుడు సంపత్ రావు,మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు,బొడిగ శోభ,కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ తుల ఉమ,ఈటల జమున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here