బెంగుళూర్:మట్టి ఇళ్లను నిర్మించుకోవడంలో భారతీయులకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది.ఇప్పటికీ లక్షల సంఖ్యలో ప్రజలు మట్టి ఇళ్లలో నివసిస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ,ప్రస్తుత 21వ శతాబ్దంలో కాం క్రీట్ గృహాలను ఇష్టపడే,నివసించే ప్రజల ధోరణి పెరుగుతోంది.అయినప్పటికీ,విలాసవంతమైన జీవనశైలిని గడపాలనుకునే వారు కొంత మంది ఉన్నారు.మిగిలిన వారికి భిన్నంగా వీకెండ్‌లలో ఫాం హౌస్‌లకు వెళ్లి జీవించే వారు ఉన్నారు.అందు కోసం నగరాల నుంచి వారాంతాల్లో ఫాంహౌస్‌లకు వెళ్లి గ్రామీణ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.ఇదే తరహాలో బెంగళూరుకు చెందిన ఉద్యోగి ఓ కొత్త మట్టి ఇంటిని నిర్మించాడు.ఇది నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.బెంగళూరుకు చెందిన కృష్ణన్ అనే వ్యక్తి కేవలం రూ.18,500తో 125 రోజులు కష్టపడి నగ ర శివార్లలో మట్టి ఇంటిని నిర్మించాడు.లే మెరిడిన్ తాజ్ గేట్వే వంటి సంస్థలలో దాదాపు 19 సంవత్సరాలు అతడు పనిచేసిన తర్వాత అతను తన జీవితాంతం నివసించడానికి విలాసవంతమైన ఇ ల్లు కొనుక్కుంటాడని అంతా భావించి ఉంటారు.అయితే అతను గ్రామీణ తరహా జీవనశైలిని గడపాలని కోరుకున్నాడు.కృష్ణన్ తన ఉద్యోగం మానేసిన తర్వాత సహజ వ్యవసాయం సహజ నిర్మాణం వంటి ప్రాథమిక జీవన నైపుణ్యాలను నేర్చుకోవడం ప్రారంభించాడు.మట్టి,పేడ,రాళ్లు,పొట్టు,తాటి ఆకులు మొదలైన సహజ పదార్థాలతో ఇంటిని ఎలా నిర్మించాలో నేర్చుకున్నాడు.బెంగళూరులోని చామరాజనగర్‌లో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మట్టి ఇంటిని కృష్ణన్ స్వయంగా నిర్మించారు.