సాగర్‌లో కమ్యూనిస్టుల మద్దతు కారుకేనట..!

హైదరాబాద్:నాగార్జున సాగర్ ఉపఎన్నికలో కమ్యూనిస్టు పార్టీల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి.ఆ పార్టీలు బరిలో లేవు.దాంతో ఆ పార్టీలు మద్దతిస్తే ప్లస్ పాయిం ట్ అవుతుందని కాంగ్రెస్,టీఆర్ఎస్ భావిస్తున్నాయి.టీఆర్ఎస్ కన్నా ముందుగా కాంగ్రెస్ నేత ఉత్తమ్ ఆ పార్టీ కార్యదర్శులకు లేఖ రాశారు.మద్దతివ్వాలని కోరారు. ఆ లేఖపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సమాచారం ఇచ్చిన ఆ పార్టీ నేతలు ఇంత వరకూ స్పందించలేదు.తెలంగాణ రాష్ట్ర సమితి కూడా కమ్యూనిస్టుల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూండటంతో వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.చివరికి ఇప్పుడు మధ్యేమార్గంగా అధికారికంగా ప్రకటించకుండా లోపాయికారీగా టీఆర్ఎస్‌కే మద్దతివ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉభయకమ్యూనిస్టు పార్టీల సానుభూతిపరులు దాదాపుగా పది వేల మంది వరకూ ఉంటారు.కమ్యూనిస్టుల పార్టీల కార్యకర్తలకు విధేయత ఎక్కువ.పార్టీ ఎవరిని సమర్థించమంటే వారినే సమర్థిస్తారు.అందుకే ఎక్కడ పోటీ చేసి నా వారి ఓటు బ్యాంక్ వారికి ఉంటుంది.ఇప్పుడు సాగర్‌లో ఆ ఓటు బ్యాంక్ ఎవరికో ఒకరికి మద్దతివ్వక తప్పని పరిస్థితి.టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో చాలా కా లం పాటు కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వలేదు.అవసరానికి ఆదరణ చూపిస్తూండటంతో కమ్యూనిస్టులు కూడా కరిగిపోతున్నారు.ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్ద తిచ్చి కేసీఆర్‌కు కోపం తెప్పించడం కన్నా అధికారికంగా ప్రకటించకుండా లోపాయికారీగా టీఆర్ఎస్‌కు మద్దతివ్వడ మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here