హుజురాబాద్:కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్ హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నందు నిందితులను హాజరుపరిచి వివరాలు వెల్ల డించారు.నేరం చేయువిధానం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన నీర్ల కళ్యాణ్,అనగోని వికాస్,కనుకుంట్ల అనిల్ మరియు తూటి వినయ్ లు హు జురాబాద్ పట్టణంలోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నందు ఫ్లిప్ కార్ట్ కొరియర్ బాయ్స్ గా గత 3 నెలల నుండి పనిచేయడం జరుగుతుంది.ఈ క్రమంలోనే వీ రు జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా కంపెనీకి సంబంధించిన కొరియర్స్ లోని వస్తువులను దొంగిలించి వాటి స్థానంలో రాళ్లు,పెంకులు,బండలను పెట్టి,అట్టి విధంగా దొంగిలించిన వస్తువులను అమ్ముకొని తద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేయాలని నిర్ణయిం చుకున్నారు.హుజురాబాద్ లోని ఫ్లిప్ కార్ట్ హబ్ కి రాగానే,వాటిని డెలివరీ కోసం వారి పేరుపై అసైన్ చేసుకొని సైదాపూర్ కి తీసుకెళ్ళేవారు.అక్కడ ముందు గానే అనుకున్నట్లు బుక్ చేసిన ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి,ఆ ఫోన్ నంబర్ నుండి వారి మిత్రుల ద్వారా అట్టి ఆర్డర్స్ రిజెక్ట్ చేయడంగాని,ఆర్డర్ చేసిన ఫోన్ నంబర్ ని స్విచ్ ఆఫ్ పెట్టి లేక కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండి,కస్టమర్ నుండి రెస్పాన్స్ లేదు అని చెప్పి,తర్వాత ఎవరు చూడని ప్రదేశంలో ఏర్పడకుండా వాటిని కత్తిరించి తీసి,అందులో రాళ్లు,పెంకులు,బండలను వస్తువుల బరువు కి తగ్గట్టు పెట్టి,వాటి ని మళ్ళీ కంపెనీకి రిటర్న్ చేసే వారు.తర్వాత అట్టి ఖరీదైన వస్తువులను అమ్ముకొని తద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసే వారు.ఇట్టి క్రమంలో అనుమానం వచ్చిన ఫ్లిప్ కార్ట్ కంపెనీ నందు హుజురాబాద్ హబ్ కి టీం లీడర్ గా పని చేస్తున్న హుజురాబాద్ పట్టణానికి చెం దిన ముప్పు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించగా,దర్యాప్తులో ఇలాంటి చాలా వస్తువులను మోసం చేసి దొంగిలించినట్లు తెలిసింది.నిందితులు పట్టుబడిన విధానం పక్క సమాచారం మేరకు ఆదివారం రోజున ఉదయం 12 గంటలకు నిందితులు మళ్ళీ ఇలాంటి తరహా నేరాలు చేయడం కోసం సైదాపూర్ బస్ స్టాండ్ వద్ద వేచి ఉన్న తరుణంలో సైదాపూర్ ఎస్సై ప్రశాంత్ రావు తన సిబ్బందితో సంయుక్త ముగా వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా ఇట్టి నేరాన్ని ఒప్పుకోవ డంతో పాటు,వారి వద్ద నుండి పై వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది.నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులు.ల్యాప్ టాప్స్08,కెమెరాలు04,వాచీలు05,ముబైల్ ఫోన్స్05, ఎయిర్ పాడ్స్04,వైర్లెస్,చార్జర్01,సోనీ మ్యూజిక్ సిస్టం 01,నైక్ షూస్03,రోడ్ స్టార్ జాకె ట్01,ఆపిల్ పెన్సిల్01,మొత్తం విలువ అందాజ.తొమ్మిది లక్షల రూపా యలు పిర్యాదిదారుడి వివరాలు,ముప్పు నవీన్ s/o స్వామి,24సం,రజక,టీం లీడర్,లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్,r/o హుజురా బాద్.నిందితుల వివరాలు..నీర్ల కళ్యాణ్ s/o మల్లేశం,24సం,తెనుగు r/o సైదాపూర్,అనగోని వికాస్ s/o సంపత్,23సం,గౌడ్ r/o సైదాపూర్,కనుకుంట్ల అనిల్ s/o వెంకట్రాజం,26 సం,పద్మ శాలి r/o సైదాపూర్,తూటి వినయ్ s/o వేణు,22సం,తెనుగు r/o సైదాపూర్,నిందితులను పట్టుకోవడం లో శ్రమించిన హుజురాబాద్ రూరల్ సిఐ ఎర్రల కిరణ్, సైదాపూర్ ఎస్సై బండ ప్రశాంత్ రావు,ట్రైనీ ఎస్సై తిరుపతి,కానిస్టేబుల్స్ రాజు,పార్థసారధి,కుమార్,రంజిత్,సతీష్ లను హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి అభినం దించారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...