ఒకే ఫ్రేములో..అక్కినేని ఫ్యామిలీ..

హైదరాబాద్:అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యకంగా చెప్పక్కర్లేదు.ఏఎన్‌ఆర్‌ తర్వాత నాగార్జున,నాగచైతన్య,అఖిల్‌,సుశాంత్‌,సుమంత్‌ హీరోలుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో సత్తా చాటు తున్నారు.అయితే తాజాగా అక్కినేని ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేములో కనిపించి కనువిందు చేశారు.రీసెంట్‌గా నాగార్జున ఇంట్లో జరిగిన గెట్‌ టుగెదర్‌ పార్టీలో అక్కినేని వారసులంతా ఒకేచోట కనిపించా రు.ఈ ఫోటోలను సుశాంత్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా క్షణాల్లో ఆ ఫోటో వైరల్‌గా మారింది.అయితే ఇందులో అఖిల్‌ మాత్రం మిస్సయ్యాడు.మాల్దీవులకు వెళ్లిన అఖిల్‌ ప్రస్తుతం వెకేషన్‌ ఎంజా య్‌ చేస్తున్నాడు.ఓల్డ్‌ పిక్‌-ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు సమంతను మిస్సవుతున్నాం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.నాగ చైతన్యతో పెళ్లి తర్వాత అక్కినేని ఫ్యామిలీ వేడుకల్లో సమంత సెంట ర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచేది.కానీ విడాకుల నేపథ్యంలో సమంత దూరమవడం అక్కినేని ఫ్యాన్స్‌ను నిరాశ పరుస్తుంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here