నవంబర్ నెలలో..బ్యాంకులకు 15 రోజులు సెలవులు

ముంబై:నవంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి.పండుగల సీజన్‌ అవ్వడంతో నవంబర్‌లో దాదాపు 15 రోజుల పాటూ బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.రెండు,నా లుగో శనివారాలు,ఆదివారాలతో పాటూ,పండుగల కారణంగా నవంబర్‌ నెలలో పలు ప్రభుత్వ,ప్రైవేటు బ్యాంకుల పనిదినాలు తగ్గనున్నాయి.రాష్ట్రాలను బట్టి బ్యాంకు సెలవుదినాల్లో హె చ్చుతగ్గులున్నాయి.అయితే బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ,ఆన్‌లైన్ సేవలకు మాత్రం ఎలాంటి అంతరాయం జరుగదని అధికారులు తెలిపారు.పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ,ప్రైవేట్ బ్యాం కులకు సంబంధించిన సెలవురోజులు ఇలా ఉన్నాయి.దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా నవంబర్ 4,నవంబర్ 5 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నా యి.దీంతో నవంబర్ నెలలో పాటూ నాలుగు ఆదివారాల్లో(నవంబర్ 7వ తేదీ,నవంబర్ 14,నవంబర్ 21,నవంబర్ 28) బ్యాంకులు పనిచేయవు.ఇక రెండో శనివారం(నవంబర్ 13), నాలుగో శనివారం( నవంబర్ 27) రోజున బ్యాంకులు పనిచేయవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here