సోయల్ బిగ్ బాస్ నుండి తప్పుకోవటానికి కారణం ఏంటి ?25 లక్షలు తీసుకోవటానికి కారణం ఏంటి?

సోయల్ బిగ్ బాస్ నుండి తప్పుకోవటానికి కారణం ఏంటి ?25 లక్షలు తీసుకోవటానికి కారణం ఏంటి?

తాజాకబురు సినిమా:బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది,కరోనా నేపథ్యం లో స్టార్ మా నిర్వహించిన బిగ్ బాస్ షో ఆద్యంతం ఆకట్టుకున్నది,హౌజ్ లో తమలోని వ్యక్తుత్వాన్ని ప్రదర్శిస్తు ఒక్కక్కరు తమ మార్క్ ను చూపిస్తు వచ్చారు,ఎలిమినేషన్ ప్రక్రియ ముగుస్తున్నకొద్ది అభిమానుల్లో ఆందోళన మొదలైంది,తమ అభిమాన కంటెస్టేంట్ గెలుపొందుతాడు అంటు పందెం లు కట్టారు,బిగ్ బాస్ చివరి అంకంలో అయిదుకు మిగిలారు, అభిజిత్,సోహేల్, అఖిల్,హరియాన,హారిక లు, అయితె “గ్రాండ్ ఫినాలే” లో మొదటగా ఎలిమినేట్ అయింది హారిక, తర్వాత హరియాన,అమ్మాయిలిద్దరు ఎలిమినేట్ కావడం తో ఈసారీ కూడా బిగ్ బాస్ విన్నర్ అబ్బాయిలదె అని అర్థం అయింది.

tajakaburu
tajakaburu

గత వారం రోజులుగా పలు సర్వేలు, సోషల్ మీడియాలో అభిజిత్ టైటిల్ గెలుచుకోగా,సోహేల్ ద్వితియ స్తానంలో ఉండాడని తెలిసింది, అయితె ముగ్గురిలో ఒక్కరు తమకు తాము వెళ్లిపోతె ఇరువై ఐదు లక్షలు ఇస్తామని హోస్టు నాగార్జున చెప్పడంతో ఒక్కసారిగా నేను వెల్లిపోతానని సోహేల్ అనటంతో అభిమానులు అవాక్కయ్యారు, ఎన్నీసార్లు ఎన్నీ చెప్పినా బయటకు వచ్చిన సోహేల్ ఇరువై అయిదు లక్షల్లో పదిలక్షలు స్వచ్చంద సంస్థ కు ఇస్తానని చెప్పడం, ఆ తర్వాత నాగార్జున తానే అవి ఇస్తానని చెప్పడం, ముఖ్య అతిధిగా వచ్చిన చిరంజీవి తానే మహాబూబ్ కు డబ్బులు ఇస్తానని చెకు ఇవ్వడం ఊహించని ట్విస్టులుగానె మిగికిపోయాయి,సోయల్ ఆ ప్రైజ్ మనీ తీసుకోవటానికి ప్రదాన కారణం వాళ్ల ఆర్థిక పరిస్థితి, దిగువ మద్యతరగతి కుటుంబంలో పుట్టిన సోహెల్ పై చదువుల కోసం హైదరాబాదులో ఉంటున్నాడు తండ్రి రామగుండం సింగరేణి లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అయితే ఆరోగ్యరీత్యా,వయసు పైబడటంతో ఆ ఉద్యోగం సోహేల్ కు ఆఫర్ చేసారు, కానీ తండ్రికి ఉన్న ఉద్యోగం తాను తీసుకుంటే ప్రభుత్వం అందించె ఇంక్రుమెంట్స్ అందవని, అలాగే తనకు నచ్చిన ఫీల్డ్ అయినా సినిమాల్లో రాణించాలని హైదరాబాదు వెళ్లాడు సోహేల్, అప్పుడెప్పుడో చిన్న చిన్న పాత్రల్లో అవకాశం వచ్చినా అది అతనికి పెద్దగా పేరు తీసుకురాలేదు, దాంతో స్వంతంగా టిక్ టాక్ లో డ్యాన్స్ చెయ్యడం, యూట్యూబ్ లో తన టాలెంట్ ను చూపించటంతో బిగ్ బాస్ టీం కంటపడ్డాడు, అందుకె సీక్రెట్ కంటెస్టేంట్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టాడు, చివరవరకు ఉన్నాడు, ఇరువైఅయిదు లక్షలు తీసుకోకుంటె తాను విన్నర్ అవుతానన్న నమ్మకం సోహేల్ కు లేదు, దాంతో ఇరువై ఐదు లక్షలు తీసుకొని స్వంత ఇళ్లు కట్టాలి, నాన్న ఆరోగ్యం బాగా చేయించాలన్న లక్ష్మంతోనే తాను ఆ డీల్ కు ఒప్పుకున్నాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here