కోల్‌కతా:దేశమంతా పర్యటించి రైతుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తానన్నారు భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయత్.పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ఆయన ఈ నెలలో మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఉత్తర ప్రదేశ్,ఒడిశా,కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తోన్న ఆందోళనలు డిసెంబర్ వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు.నూతన వ్యవసాయ చట్టాలు చిన్న వ్యాపారాలు పరిశ్రమల మూసివేతకు దారితీస్తాయని కేవ లం వాల్‌మార్ట్ లాంటి పెద్ద పెద్ద మాల్స్‌కు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.వివిధ పంటలకు కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టాలను తాము కోరుకుంటు న్నట్లు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీకి చెందినది అయితే రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేదని కానీ ఇది బడా వ్యాపారులు నడిపిస్తున్న ప్ర భుత్వమని ఫైర్ అయ్యారు.దేశం మొత్తాన్ని విక్రయించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాకేశ్ టికాయత్ వ్యాఖ్యానించారు.అలాగే బీజేపీని ఓడించాలని పశ్చి మబెంగాల్ రైతులకు పిలుపునిచ్చారు టికాయత్.బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే పేదల భూములు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతాయని ఆయన ఆరోపించా రు.కేంద్రం రైతుల వెన్ను విరుస్తోందని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని అణచివేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...