చొక్కవేసుకొమ్మంటె భార్యను వదులుకున్నాడు,కానీ యాబై ఏళ్లనుండి చొక్కమాత్రం వేసుకోలేదు..చొక్కవేసుకోని బక్కన్న..

చొక్కవేసుకొమ్మంటె బార్యను వదులుకున్నాడు కానీ…. చొక్కమాత్రం వేసుకోలేదు..చొక్కవేసుకోని బక్కన్న..

 

నలుగురి నచ్చినది అతనికి నచ్చదు, ఆదోందోగాని ఊహా తెలిసినాటినుండి చొక్కవేసుకోవటం అంటె మహా చెడ్డ చిరాకు అతనికి , చిన్నప్రాయంలోనె అమ్మనాన్నలతో గొడవ పడెవాడు నేను చొక్కవేసుకోని అని, అలా మొదలైన అతని అలవాటు యాబై ఏళ్లు గడుస్తున్న మారటం లేదు, ఓ సందర్బంలో నువ్వు చొక్కవేసుకోకుంటె నేను నీ తాన ఉండనని బార్య హుకుం జారీ చేసింది, అయినా నువ్వు లేకున్న ఫర్వలేదు కానీ నును మాత్రం చొక్కవేసుకోను అని చెప్పేశాడు, ఇక కుదరదు అనుకున్న ఆమె ముళ్లెమూట సద్దుకొని వెళ్లిపోయింది, అసలు గీ చొక్క లొల్లి ఏంటి అనుకుంటున్నారా…గా గక్కడికె వస్తున్నా…

TajakaburuLine
Tajakaburu

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర బక్కన్న తనకు ఊహా తెలిసి నాటి నుండి చొక్కవేసుకోలేదు, ఎండకాలం, చలికాలం, వానా కాలం ఇలా ఏ కాలమైన ఐ డోంట్ కేర్ అంటాడు, అసలు ఆయనకు చొక్క అంటె ఎందుకు నచ్చదూ…

బాల్యం నుండి చొక్క అంటె విరక్తి….

బక్కన్న కు ఓ సోదరుడు ఉన్నాడు, చిన్న వయసునుండి ఇద్దరు ఎంతో ఆప్యాయంగా ఉంటారు, వ్రుత్తిరిత్యా యాదవ కులానికి చెందిన బక్కన్న నిత్యం గొర్రెలను కాయటానికి వెలుతుంటె, పొద్దుపొద్దుగల్ల పోతె మల్ల పొద్దుగూకినాకె వస్తుండె, అక్కడ మూగజీవాలతో దోస్తీ బాగా అయింది, దాంతో రోజు పనికి వెళ్లిరావటం మాత్రమె తెలుసు, ఇలా గడుస్తున్న తరుణంతో ఓ రోజు ’గొంగడి’ తీసుకెళ్లిన బక్కన్న రాత్రి అక్కడె ఉన్నాడు, కానీ చలికాలం అయినా గొంగడి కప్పుకోలేదు, ఒకవేళ కప్పుకున్న చిరాకు వచ్చింది, అప్పటినుండి ఒంటిపై ఏది కప్పుకోవద్దని అనుకున్నాడు…8 సంవత్సరాల వయసునుండి చొక్కవేసుకోవటం మానేసిన అతను ఇప్పడివరకు వేసుకోలేదు..

Tajakaburu
Tajakaburu

చొక్కవేసుకోను…కావాలంటె నువ్వు వెళ్లిపోవచ్చు..

బక్కన్న కాస్తా వయసు వచ్చాక తల్లీదండ్రులు వివాహాం చేశారు, సంవత్సరం పాటు కలిసి ఉన్న దంపతుల మద్య చొక్కనె చిచ్చు పెట్టింది, నువ్వు బయటకు వెళ్లెట్టప్పుడైన చొక్కవేసుకోవాలిన బక్కన్న బార్య ఎంత ప్రాదేయపడినా ససెమీరా అన్నాడు, నువ్వు కాదంటె వెళ్లు నేను మాత్రం చొక్కవేసుకోను అని చెప్పాడు, చొక్కపెట్టిన చిచ్చకు అతని బార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది, ఇప్పటికి నలుబై ఏళ్లకు పైనె అవుతుంది…

అన్నయ్యనె ’నాన్న’ లా…

బక్కన్నకు అన్నయ్య అంటె ఎంతొ ఇష్టం ఇప్పుడు బక్కన్న వయసు 59 అయినా ..అన్న చెప్పిన మాట జవదాటడూ, ఒక్క చొక్క విషయం మినహాయిస్తె, తన వ్యవసాయ భూమిలో పంటలు పండిస్తు జీవితం గడుపుతున్నాడు…

Tajakaburu
Tajakaburu

గ్రామ గాంధి గా ….

చొక్కలేకుండా ఉండటంతో గ్రామంలోని తెలిసినవాళ్లు బక్కన్నకు నేటి గాంధి అని పేరు పెట్టారు, ఇతనికి ఉన్న క్రేజ్ కు ఆయన వార్డులో ఏకగ్రీవంగా వార్డు సభ్యుడిగా ఎన్నుకున్నారు గ్రామస్తులు, తనపై ఉంచిన నమ్మకాన్ని బక్కన్న వమ్ము చెయ్యలేదు, తన వార్డును మంచి అభివ్రుద్ది చేపించాడు…

మాజీ మంత్రి రత్నాకర్ రావు ప్రియ శిశ్యుడు..

మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావుకు బక్కన్న అంటె ఎనలేని ప్రేమ, అందుకె బక్కన్న, రత్నాకర్ రావు కార్యక్రమాలు ఎక్కడ ఉన్న తాను ఖచ్చితంగా హాజరవుతెండె, అలాగె ఎన్నికల సమయంలో ప్రచారం కూడా నిర్వహిస్తుండె, ఇక్కడ ఇంకో విషయం చెప్పకోవాలి ఎక్కడ ఎలాంటి మీటింగులు ఉన్న చొక్కలేకుండానె వెళుతుండె బక్కన్న….

ఇదేంది బక్కన్న అంటె తాను చెప్పేది ఒక్కటె, నాకు పెయి(చాతీబాగంలో) ఎలాంటి దుస్తులు వేసుకున్న ఇష్టం ఉండదు, అందకె తాను యాబై ఏళ్లుగా చొక్కవేసుకోకుండానె ఉంటున్నానని చెపుతున్నాడు..ఒక్కోక్కరిది ఒకరకమైన అభిరుచి తనకు చొక్కవేసుకోకపోవటమె తనకు నచ్చిన అభిరుచి అని చెపుతాడు బక్కన్న..

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here