గొల్లపెల్లి పోలీస్ స్టేషన్ లొనే కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు, స్టేషన్ లో లాఠీ ఛార్జి చేసిన పోలీసులు…..భాజపా, తెరాస కార్యకర్తలు గొడవ…ఒక్కరికొక్కరు దాడికి పాల్పడ్డ కార్యకర్తలు..గొల్లపల్లిలో ఉద్రిక్తత..

తాజాకబురు: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో తెరాస, భాజపా కార్యకర్తలు బాహాబాహికి దిగారు.. ఒకరికిపై ఒక్కరు దాడికి పాల్పడ్డారు.. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.. గత నాలుగు రోజులుగా ప్లెక్సిల విషయంలో రెండు పార్టీల మధ్య వివాదం చెలరేగుతోంది. తెరాస పార్టీ ప్లెక్సిలను అలాగే ఉంచుతూ భాజపా ప్లెక్సిలను తొలగిస్తున్నారంటూ భాజపా నాయకులు ఆందోళనచేస్తున్నారు.. ఈక్రమంలో గత రెండు రోజుల క్రితం భాజపా నాయకుల ఆందోళన సైతం చేశారు.. అయితే ఈ రోజు మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన ఉండటంతో భాజపా నాయకులు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.. దీంతో రెండు పార్టీల కార్యకర్తలమాటమాట పెరిగి ఒక్కరికిపై ఒక్కరు దాడికి పాల్పడ్డరు.. ఇందులో కొందరు కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు… రెండు పార్టీల గొడవతో పోలీసులు అప్రమత్తమై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు,పోలిసులు ఇరువర్గాలను శాంతింపజేసి పోలిసు స్టేషన్ తరలించారు, అయితె గొల్లపెల్లి పోలీస్ స్టేషన్ లొనే కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు బీజేపీ నాయకులు, స్టేషన్ లో లాఠీ ఛార్జిచార్జ్ చేశారు పోలీసులు