కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు…రామ మందిరం కోసం కొత్తగా బీజేపి నాయకులు బిచ్చం ఎత్తుకుంటున్నారు..

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు…రామ మందిరం కోసం కొత్తగా బీజేపి నాయకులు బిచ్చం ఎత్తుకుంటున్నారు..

తాజాకబురు హైదారాబాద్:జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరోసారి వార్తలకెక్కాడు, గత కొన్ని రోజుల క్రితం రైతులను ఉద్దెశించి వివాదస్పద వాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా దేవుడిపై వాఖ్యలు చేశారు, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు తలసానితో  పలు కార్యక్రమాల్లో పాల్గోన్న ఆయన బహింగ సభలో బీజెపి నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు, ఆయన మాట్లాడుతూ…

మేమందరం శ్రీరాముని భక్తులమే బొట్టు పెట్టుకుంటేనే రాముడి భక్తులం అవుతామా???కొత్తగా బీజేపీ నాయకులు అయోధ్యలో రామ మందిరం కోసం చందాలు వసూలు చేస్తున్నారు…ఉత్తర్ప్రదేశ్ లో ఉన్న ఆ రాముడు మనకెందుకు మన గ్రామాల్లో మనకు రాముడు ఉన్నడంటూ వ్యాఖ్యలు..అయ్యోద్య రామాలయనికి చందాలు ఎవరు కూడా ఇవ్వొద్దని పిలుపు…ఇప్పుడు కొత్తగా బీజేపీ నేతలు రామమందిరం పేరుపై బిచ్చమెత్తుకుంటుర్రు……ఎవరి గ్రామాల్లో వారికి రామాలయలు ఉన్నాయి..పలువురు బీజేపీ నేతలు  రామమందిరంపై కొత్త నాటకం ఆడుతున్నారు….రామమందిర నిర్మాణం పేరుతో బీజేపీ కొత్త రాజకీయ డ్రామా ఆడుతోందని విమర్శ చేశారు, దీంతొ ఈ వాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, రాజకీయంగా ఎవరిపై ఎలాంటి వాఖ్యలు చేసిన ఫర్వలేదు కానీ రాజకీయానికి దేవుడిని ముడిపెట్టి మాట్లాడటం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..ఓ ప్రజాప్రతినిధిగా ఉండి ఎమ్మెల్యే స్తానంలో ఉండి ఇలా శ్రీరాముడిపై వ్యక్తిగత ఆరోపనలు చెయ్యటం ఏంటని , ఆర్,యస్,యస్, విశ్వహిందు పరిషత్ తప్పుబడుతున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here