న్యూఢిల్లీ:అదనపు వనరులను సేకరించే క్రమంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం రూ .2.5 లక్షల కోట్ల ఆస్తి మోనటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా ఢిల్లీ,ముంబై,బెంగళూరు,హైదరాబాద్ విమానాశ్రయాలలో మిగిలిన ప్రభుత్వ వాటాలను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తుంది.ఇందుకోసం 13 విమానా శ్రయాలను గుర్తించిన ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లోని నాలుగు విమానాశ్రయాలలో మిగిలిన వాటాను 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణ చేయనున్నట్లు చెబుతున్నారు.ఈక్విటీ వాటాను ఉపసంహరించుకోవడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అవసరమైన అనుమతులు పొందుతుం దని,ఈ సమస్యను రాబోయే కొద్ది రోజుల్లో ఆమోదం కోసం కేబినెట్‌కు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.ప్రైవేటీకరణ కోసం గుర్తించిన 13 AAI వి మానాశ్రయాల్లో లాభదాయకమైన మరియు లాభాపేక్షలేని విమానాశ్రయాలను క్లబ్బింగ్ చేసి అమ్మకానికి పెట్టాలని భావిస్తున్నారు.ప్రైవేటు సంస్థల నుంచి ఆకర్షణీ యమైన రేటు కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటోంది ప్రభుత్వం.త్వరలో విక్రయించబోయే విమానాశ్రయాల జాబితాలో అమృత్‌సర్,వారణాసి,భువనేశ్వర్,ఇండో ర్,రాయ్‌పూర్,తిరుచ్చి తదితర విమానాశ్రయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో మొదటి రౌండ్ విమానాశ్రయాల ప్రైవేటీకరణలో అ దానీ గ్రూప్ గత ఏడాది లక్నో,అహ్మదాబాద్,జైపూర్,మంగళూరు, తిరువనంతపురం,మరియు గౌహతి ఆరు విమానాశ్రయాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.పౌర విమానయాన మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తున్న AAI, దేశవ్యాప్తంగా 100 కి పైగా విమానాశ్రయాలను నిర్వహిస్తుంది.ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అ దానీ గ్రూప్ 74 శాతం వాటాను కలిగి ఉంది,మిగిలిన 26 శాతం వాటా AAIకి ఉంది.ఇప్పుడు మిగిలిన వాటను అమ్మేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జిఎంఆర్ గ్రూప్ 54 శాతం,ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 26 శాతం,ఫ్రాపోర్ట్ ఎజి,ఎరామన్ మలేషియా ఒక్కొక్కటి 10 శాతం వాటాను కలిగి ఉన్నాయి.హైదరాబాద్ విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో AAIకి 26 శాతం వాటా ఉంది.బెంగళూరు విమానాశ్రయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి ఏఏఐకి 26 శాతం వాటా ఉంది.AAI తో పాటు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లో కూడా బెంగళూరు ప్రభుత్వం వాటాను కలిగి ఉంది.చమురు,గ్యాస్ పైప్‌లైన్ల వంటి 100 ఆస్తులను అమ్మి డబ్బు ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా దీని ద్వారా రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చని కేంద్రం భావిస్తోంది.
Latest article
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...
దేశంలో కరోనా డేంజర్ బెల్స్
న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...