ముంబై:ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవకవి వరవరరావు (82)కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది.అనారోగ్య కారణాలతో బెయిలుపై విడుదలైన వరవర రా వు భార్యతో కలిసి ముంబైలోనే ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.బెయిలును పొడిగించడంతోపాటు స్వస్థలం హైదరాబాద్లో ఉండేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.మెదడులోను,కళ్లలోనూ సమస్యలు వచ్చాయని జైలులో వీటికి తగిన చికిత్స అందుబాటులో లేదని వరవరరావు తన పిటిషన్ పేర్కొన్నారు.అలాగే,పార్కిన్సన్స్ వ్యాధి వచ్చినట్టు అనుమానం ఉందన్నారు.అయితే,సమయం మించిపోవడంతో ఈ పిటిషన్ను పూర్తిగా విచారించలేకపోయిన ధర్మాసనం వరవరరావుకు ఊరట లభించింది.ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్ఐఏను ఆదేశించింది.అక్టోబరు 14 వరకు తోలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది.