ఈటల కు దళితుల ఆత్మీయ సన్మానం


జమ్మికుంట:హుజురాబాద్ నియోజకవర్గానికి దళితబంధు రావడానికి కారణమైన ఈటల రాజేందర్ కు దళిత సంఘాల సమైఖ్య వేదిక ఆధ్వర్యంలో దళితుల ఆత్మీయ సన్మాన సభ జరిగింది.జమ్మికుంటలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్,మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ,గాలన్న,మాదిగ హక్కుల దండోరా,SCF రాష్ట్ర,నియోజకవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.*మేడి రమణ,SCF రాష్ట్ర అధ్యక్షుడు*:హుజూరాబాద్ లో 50 వేలమంది దళితులు ఉన్నాము.మేమందరం ఈటల రా జేందర్ వెంటే ఉన్నాము.దళితబందు కార్యక్రమం ఈటల రాజేందర్ వల్లనే వచ్చింది.నిజమైన దళిత బాందవుడు కేసిఆర్ కాదు,ఈటల రాజేందర్.కెసిఆర్ దళితులను మోసం చేశాడు.దళిత హక్కుల కోసం పోరాడింది ఈటల రాజేందర్.రాజేందర్ ఒంటరి వాడు కాదు,మేమందరం అండగా ఉన్నాము.లక్ష ఓట్ల మెజారిటీ తో ఈటల గెల వబోతున్నరు.కెసిఆర్ నిరంకుశ పాలన ఇక సాగదు.మీ మోసపు మాటలు హుజూరాబాద్ ప్రజలు నమ్మరు.
*సునీల్,మాదిగ హక్కుల దండోరా అధ్యక్షులు*కుంభ కర్ణుని కెల్ల ఆరేళ్లుగా పండుకున్న కెసిఆర్నీ చురుకు పెట్టీలేపిన ఈటల రాజేందర్ అన్నకుకృతజ్ఞతలు.కెసిఆర్ ఒక్కో దళితునికి 45 లక్షల బాకీ ఉన్నాడు.ఇప్పుడు ఇచ్చే 10 లక్షలు మిత్తి కింద కట్టి మిగిలిన డబ్బులు అడుగుదాం.తెరాస ఓడిపోతేనే మనకు డబ్బులు వస్తా యి.రాజేందర్ అన్నను అసెంబ్లీకి పంపిస్తే ఆయన కొట్లాడి తెస్తాడు.కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న దళిత బాందవుడు ఈటల రాజేందర్ కు అండగా ఉంటాం.ఆరడు గుల బుల్లెట్ వాళ్ళ నియోజకవర్గం లో రెండు వేల రూపాయల పెన్షన్ నే ఇప్పించలేక పోయాడు.మరి హుజురాబాద్ నియోజకవర్గంలో నువ్వేం చేయగలవు.
*మాలమహానాడు రాష్ట్ర నాయకుడు,మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీను*వడ్లు కొనిపించిండు,పెన్షన్,రేషన్ కార్డు ఇప్పించిండు ఇప్పుడు దళిత బంధు కూడా ఇప్పి స్తుంది కూడా ఈటల రాజేందర్ నే.కెసిఆర్ మెడలు వంగాలి అంటే ఈటల రాజేందర్ గెలవాలి.చిన్న చిన్న తాయిలాలకి ఆశపడకుండా అన్నకు అండగా ఉంటాం. *దండు సురేందర్ మాదిగ,మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షుడు*ప్రగతి భవన్లో పందుకున్న కెసిఆర్ ను ఊరు ఊరుకి తిప్పుతున్న నేత ఈటల రాజేందర్ కె సిఆర్ దళితులను మోసం చేశాడు.
*బోడిగ శోభ,చొప్పదండి మాజీ ఎమ్మెల్యే*ఈటల రాజేందర్ అపత్బందవుడు.దళిత బంధు రావడానికి కారణం ఈటల రాజేందర్త.కృతజ్ఞత చెప్పుకుంటే అది రాజేందర్ అన్నకే చెప్పాలని ఈ రోజు సమావేశం పెట్టుకున్నాం.మాది విశ్వాసం గల జాతి.ఈటెల రాజేందర్ రాజీనామా వల్లనే కెసిఆర్ దళిత బంధు ఇస్తున్నాడు.కెసిఆర్ మూర్ఖు డు,దళిత ద్రోహి,నీచుడు,మాయల పకీరు,దళిత ద్రోహి అన్నారు.ఈటెలరాజేందర్ గొంతు పిసకడం కోసం దళిత బంధు తెచ్చాడు.దళితులతో పెట్టు కున్నవాడు బతికి బట్ట కొట్టినోడు లేడు.ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పర్సెంటేజ్ కోసం కాళేశ్వరంకి మళ్లించిన మూర్ఖు డు కెసిఆర్.ఏ నాడు కూడా అంబేడ్కర్ కి దండ వేయని వాడు మ న మీద ప్రేమ ఉంది అంటే నమ్మాలా?మనల్ని కెసి ఆర్ ఉద్దరించడు.రాజేందర్ మీద కక్షతో హుజూరాబాద్ కి కెసిఆర్ వచ్చాడు తప్ప దళితుల మీద ప్రేమ తో కాదు. కెసిఆర్ మాయలో పడవద్దు.3 ఎకరాలు ఇవ్వలేదు 40 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేద్దాం.ఈటెలరాజేందర్ ను అసెంబ్లీ పం పించడమే దళితులకు గౌరవం.ఈటెల గెలుపు మా భాధ్యత.119 నియోజక వర్గాల కు దళిత బంధు కావాలంటే 2.5 లక్షల కోట్లు కావాలి.బడ్జెట్ లేనిది ఎక్కడ నుండి తీసుకువస్తారు.మోసపోవద్దు.ఈట లరాజేందర్ చిన్నోడు అని కెసిఆర్ మాట్లాడిండు,చిన్నోడికి భయపడే హుజురాబాద్ కి పరిగెత్తిండు.దళిత బంధు అందరికీ ఇవ్వకపోతే కల్వకుంట్ల కుటుం బానికి చావు డప్పు తప్పదు.
*ఈటలరాజేందర్,మాజీ మంత్రి*:పోరాడే వారు ఉంటారు,పోరాడితే ఫలితాలు ఇచ్చే వారు ఉంటారు.పోరాడిన వారినే చరి త్ర గుర్తు పెట్టుకుంటుంది.దళితులు అమా యుకులే కావొచ్చు కానీ గోర్లు కాదు.నాయకులకు అవసరాలు ఉంటాయి కావొచ్చు కానీ మొఖమేద చెప్పే సత్తా సామాన్య జనానికి ఉంటుంది.రాజేందర్ లెఫ్ట్ రైట్ సెంటర్ అందరూ పోయారు మళ్ళీ సామాన్య జనమే మిగిలారు.సమాజ బాగే ప్రజల ఎజెండా ఉంటుంది.పాలకులు ఎప్పుడు ప్రజలమీద ప్రేమతో కాదు,పవ ర్ కోసం జరిగే సంఘర్షణలో ఇచ్చే తాయిలలే ఈటెలరాజేందర్ ను ప్రాణం వుండగానే బొంద పెట్టాలి అని ఈ స్కీం తెచ్చా రు.కెసిఆర్ 38 సంవత్సరాలు గా ఎమ్మెల్యే గా,కేంద్ర మంత్రి గా ఉన్నారు.ఇన్నాళ్ళుగా దళితులు ఎందుకు గుర్తు రాలేదు.తెలంగాణ వస్తే ఆకలి కేకలు,ఆత్మహత్యలు లేని,అణచివేత లు లేని పాలన వస్తుంది అన్నారు. దళితుడే సీఎం అన్నాడు,మాట తప్పితే తల నరుక్కుంటా అన్నారు.మరి మాట తప్పిండా? నిలబెట్టుకున్నడ ?అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజ లను మోసం చే యవద్దు.ఖజానాలో డబ్బులు ఉంటే ఎందుకు ఇవ్వడం లేదు.దళిత బంధును ఎవ్వరూ ఆపరు.మీరే కేసులు వేసి ఆపుతారేమో?నిజాం కంటే ఖర్కోటకమైన ప్రభుత్వం కెసిఆర్ ది అని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు.రాష్ట్ర చరిత్ర లో చీకటి అధ్యాయం నడుస్తుంది.పోలీసులు,నాయకులు ఆలోచించండి,రేపు మీ మీద కూడా ఇదే ప్ర యోగించవచ్చు.నికృష్ట పాలనలో మీరు కూడా కొట్టుకు పోతారు.హుజూరాబాద్ గడ్డ చైతన్యవంతం అయినది కాబట్టి కెసిఆర్ కుట్రలను తట్టుకోగలగుతుంది.ఈ స్కీం కి కారణం నేనే అంటూ మీరందరూ గుర్తించినందుకు మీ అందరికీ తలవంచి నమస్కరిస్తున్న.అఫర్లకు పోకుండా ఆత్మగౌరవం కోసం కొట్లడిన బిడ్డను నేను.వైఎస్ రాజ శఖరరెడ్డి ఎంత ఒత్తిడి చేసిన పోలేదు.తెలంగాణ ఉద్యమం వల్లనే నేను ఎమ్మెల్యే అయ్యా అని అప్పుడే చెప్పిన.కెసిఆర్ నీకు ఇన్ని కొట్లు ఎక్కడి నుండి వచ్చాయి.ఎ క్కడినుండి ఇన్ని డబ్బులు తెచ్చి నాయకులను కొంటున్నవు.సామాన్యుడు,డబ్బు లేనివాడు ఎమ్మెల్యే నో ప్రజా ప్రతినిధి అయ్యే పరిస్థితి లేదు.డబ్బులు పెరిగాయి, దాన్ని విరవల్సిన సమయం వచ్చింది.దానికి హుజురాబాద్ నే వేదిక కావాలని ఈటల రాజేందర్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here