రమణ,పెద్ది రెడ్డిలకు మొండిచేయేనా..?

కరీంనగర్:ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు మొత్తం నాలుగు స్థానాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులకు దక్కుతాయని అంతా అనుకున్నారు.ఆ సంఖ్య అలాగే ఉన్నా మాజీ మంత్రులు ఎల్.రమణ,పెద్దిరెడ్డికి జాబితాలో అవకాశం రాకపోవడంతో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు ఎల్.రమణ,పెద్ది రెడ్డి టీఆర్ ఎస్‌లో చేరారు.టీడీపీలో ఉన్న రమణ,బీజేపీలో ఉన్న పెద్దిరెడ్డి కేసీఆర్ సమక్షంలో కారెక్కారు.వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని వారి సేవలను తగిన రీతిలో ఉపయోగించు కుంటామ ని కేసీఆర్ అన్నారు.దీంతో వారికి ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది.కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు.నిజానికి ఆదివారం వరకు ఎల్.రమణకు ఎమ్మెల్సీ ఇస్తారని అంతా అనుకున్నారు.కేసీఆర్ పరిశీలిస్తున్న పేర్ల జాబితాలో రమణ పేరు కూడా ఉందని మీడియాలో వార్తలు రావడంతో బీసీ నాయకుడి కోటాలో ఆయనకు ఛాన్స్ దక్కుతుం దని అనుచరులు భావించారు.కానీ పార్టీ నిర్ణయంతో ఆయన వర్గం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.ఈ నేపథ్యంలో ఎల్.రమణకు ఏం పదవి ఇస్తారన్న ఉత్కంఠ మళ్లీ మొదలైంది అదే సమయంలో ఆయనకు టీఎస్సీవో (తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) చైర్మన్‌గా అవకాశం ఇస్తారన్న ప్రచారం కూడా ప్రారంభమైంది.టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి గా కొనసాగిన ఎల్.రమణ హుజూరాబాద్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌లో చేరారు.ఆయనను హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో దించుతారన్న ప్రచారం కూడా సాగింది.కానీ కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించడంతో రమణకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.మరోవైపు ఈటల బీజే పీలో చేరడంతో అలిగి కమలం పార్టీ నుంచి బయటికొచ్చేసిన సీనియర్ నేత పెద్దిరెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తారని ఆశించారు.పెద్దిరెడ్డి ఉప ఎన్నికలో బాగానే కీలకంగా పనిచేశారు.అ యినా ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ రాలేదు.ఇటు పెద్దిరెడ్డి,అటు రమణకు ఎమ్మెల్సీగా ఛాన్స్ రాకపోవడంతో మాజీ సహచరులకు కేసీఆర్ మొండిచేయి చూపారనే అభిప్రాయం వ్యక్త మవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here