న్యూఢీల్లి:సంగీత దర్శకుడు ఇళయరాజా రాజ్యసభకు నామినేట్ అయ్యారు.ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్,లెజండరీ అథ్లెట్ పీటీ ఉష,కర్నాటకలోని ధర్మస్థల దే వాలయ సంరక్షకుడు సంఘ సంస్కర్త వీరేంద్ర హెగ్డే కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు.ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో వెల్లడించారు.వారికి శుభాకాంక్షలు తెలిపా రు.రాజ్యాంగాధికారం ప్రకారం సంగీత,సాహిత్య,వైజ్ఞానికత,ఆర్థిక రంగాలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం ఉంది.ఆ కోటా లోనే ఆరేళ్ల కింద మోదీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని ఎగువ సభకు పంపింది.ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది.ఇళయరాజా ఇటీవల ‘అంబేద్కర్-మోదీ’ పుస్తకానికి ముందుమాటలో ప్రధాని మోదీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.ఆ వ్యాఖ్యలపై చర్చ జరిగిన నేపథ్యంలో తాజాగా ఆయనకు రాజ్యసభకు వెళ్లే అదృష్టం దక్కడం గమనార్హం.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...