అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌ను స‌న్మానించిన ఎమ్మెల్యే గ‌ణేష్ బిగాల

నిజామాబాద్:అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌ను కుటుంబ స‌మేతంగా స‌న్మానించిన నిజామాబాద్ అర్బ‌న్ ఎమ్మెల్యే గ‌ణేష్ బిగాల నిఖత్ జ‌రిన్,ఇషా సింగ్ ల‌ను ఇంటికి అహ్వ‌నించి స‌న్మానించారు.అంత ర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నిజామాబాద్ కు చేందిన బాక్సింగ్ క్రీడాకారిణి నిఖ‌త్ జ‌రిన్ తో పాటు మ‌రో క్రీడాకారిణి ఇషా సింగ్ ల‌ను త‌మ నివా సంలో స‌న్మానించారు నిజామాబాద్ అర్బ‌న్ శాస‌న స‌భ్యులు గణేష్ బిగాల ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ మరియు జర్మనీలో జరిగిన ఐఎస్ ఎస్ ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఈషా సింగ్ ను త‌మ ఇంటికి అహ్వ‌నించారు ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యులు ఇరువురి క్రీడాకారుల నుండి వారి అనుభ‌వాల‌ను తెలుసుకున్న ఎమ్మెల్యే గ‌ణేష్ బిగాల దంప‌తులు వారి కృషిని అభినందించారు.ఈ త‌రం అమ్మాయిల‌కు స్పూర్తిగా నిలిచి,బార‌త కీర్తి పతకాన్ని అంత‌ర్జాతీయ స్థాయిలో ఎగ‌ర‌వేయ‌డం అబినంద‌నీయం అన్నారు.త‌మ ఇంటికి వ‌చ్చిన క్రీడాకారుల‌కు ఎమ్మెల్యే గ‌ణేష్ బిగాల దంప‌తులు శాలువ,బోకేల‌తో స‌న్మానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here