ప్రశ్నించినందుకే..మల్లన్న అరెస్టా..?

హైదరాబాద్:తీన్మార్ మల్లన్న(క్యూ న్యూస్)అలియాస్ చింతపండు నవీన్‌ను పోలీసులు శనివారం సికింద్రాబాద్ సివిల్ కోర్టులో హాజరుపరిచారు.మెజిస్ట్రేట్ ముందు హా జరు పరిచడంతో కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.అయితే ఏడు రోజుల కస్టడీకి అనుమతించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.మల్ల న్నకు 14 రోజులు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.డబ్బుల కోసం ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో చిలకల గూడ పో లీసులు శుక్రవారం రాత్రి మల్లన్నను అరెస్ట్ చేశారు.ఈ ఏడాది ఏప్రిల్ లో నమోదైన ఈ కేసులో మల్లన్నకు రెండు సార్లు నోటీసులు ఇచ్చామని ఇప్పటికే విచారణ చే శామని తెలిపారు.ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అధికారికంగా ధృవీకరించింది.కాగా తనపై ఐపీసీ 306,511 సెక్షన్స్ పెట్టడం పై అభ్యంతరం తెలిపారు తీన్మార్ మల్లన్న తరుపు న్యాయవాది.ఫిర్యాదుదారుడు సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించలేదనిన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.దీంతో ఈ విషయమై పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది.ఇక చిలకలగూడ పోలీసులు ఏడు రోజుల పాటు కస్టడీకి కోరారు.ఇక మల్లన్న తరపున న్యాయవాది ఉమేష్‌ చంద్ర బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.అనంతరం మల్లన్నను చంచల్ గూడ జైలకు తరలించారు.కాగా తీన్మార్‌ మల్లన్న డబ్బుల కోసం తనను బ్లాక్ మెయిల్ చే శాడని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్​శర్మ పోలీసులకు ఏప్రిల్‌ 22న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.30 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఇవ్వక పోయేసరికి తనను బ్లాక్ మెయిల్ చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఆయనిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లన్నపై కేసు నమోదు చేశా రు.సికింద్రాబాద్ సీతాఫల్​ మండిలోని మధురానగర్​లో ‘మారుతీ జ్యోతిష్యాలయం’ అనే ఓ సంస్థను లక్ష్మీకాంతశర్మ నిర్వహిస్తున్నారు.ఇటీవల తనకు వ్యతిరేకంగా మ ల్లన్న తన యూట్యూబ్​ఛానల్​లో వరుస కథనాలు ప్రసారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.మల్లన్నని శనివారం ఉదయం కోర్టులో పోలీసులు హాజరు పర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here