హైదరాబాద్:టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును (టెట్) షెడ్యూల్ ప్రకారం జూన్ 12నే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు.జూన్ 12న ఆర్‌ఆర్‌బీ కూడా ఉన్నందున టెట్‌ను వాయిదా వేయాలని కోరుతూ పవన్‌కుమార్ అనే అభ్యర్థి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో విజ్ఞప్తిచేశారు.ఇదే అంశంపై మంత్రి సబితాఇంద్రారెడ్డికి రీట్వీట్ చేసిన కేటీఆర్ ఈ అంశాన్ని పరిశీలించాలని సూ చించారు.దీనిపై ట్విట్టర్‌లో స్పందించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ అంశంపై తాను అధికారులతో మాట్లాడానని,వాయిదా వేయలేమని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సారి టెట్‌కు 3.5 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని,పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేశామని,ఇప్పటికిప్పుడు వాయిదా వేయలేమని పేర్కొన్నారు.టెట్ హాల్‌టికెట్లను జూన్ ఆరు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ రాధా రెడ్డి వెల్లడించారు.టెట్ పేపర్-1కు 1,480,పేపర్-2కు 1,171 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.