విజయ్ రూపానిని అందుకే పక్కన పెట్టారా..?

0
314

గాంధీనగర్:వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో చివర కూర్చున్నా అన్నీ మన చెంతకే వస్తాయని అంటారు.ఇది అన్నివేళలా నిజం కాదని ఇప్పుడు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని విషయంలో అర్థమై పోయింది.గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న రూపాని రాజీనామా చెయ్యడం దేశ రాజకీయాల్లో చర్చినీయాంశం అ య్యింది.విజయ్ రూపాని హోమ్ మంత్రి అమిత్ షా కు అత్యంత సన్నిహితుడు,ప్రియ శిష్యుడు.అలాగే గుజరాత్ గవర్నర్ ఆనంది బెన్ కు అత్యంత నమ్మకస్తుడు.అ యినా విజయ్ ఎందుకు రాజీనామా చెయ్యవలసి వచ్చింది ?ఈ విషయం గురించి మీడియా ఆరాతీయడం మొదలు పెట్టింది.కరోనా రెండవ దశ గుజరాత్ మీద ఎక్కు వ ప్రభావితం చూపింది.ముఖ్యమంత్రిగా విజయ్ సకాలంలో దానిని సమర్ధవంతంగా ఎదుర్కోలేక పోవడం,ప్రజలకు టీకాలను అందించకపోవడం తో ప్రతి పక్షాలు విరు చుక పడ్డాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,హోమ్ మంత్రి అమిత్ షా ఇద్దరు గుజరాత్ కు చెందినవారే.అక్కడ ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే.ఈ విషయంలో మో డీ,అమిత్ ఇద్దరు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.అందుకే’మనవాడు అన్న అభిమానం’పక్కన పెట్టి,విజయ్ ను రాజీనామా చెయ్యమని హుకుం జారీ చే శారట.ఇంతకాలం తన పదవికి ముప్పులేదని భవిస్తూ వచ్చిన విజయ్ రూపాని ఢిల్లీ నుంచి ఆజ్ఞ రాగానే కంగు తిన్నాడు.గత్యంతరం లేని పరిస్థితుల్లో పెద్దల పరువు కాపాడటం కోసం రాజీపడిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here