అల్‌ఖైదా చీఫ్ బతికే ఉన్నాడా?

కాబూల్:ఆల్ ఖైదా చీఫ్ బతికే ఉన్నాడా.ఆయన మరణించాడనే వార్తల్లో నిజం లేదా.అదంతా ప్రచారమేనా.ఇప్పుడు తాజాగా వస్తున్న వీడియోలు ఆధారాలు అవననే చెబుతున్నారు.చాలా కాలం క్రితమేచనిపోయాడనుకున్న అల్‌ఖైదా చీఫ్ అయ్‌మాన్ అల్‌-జవహిరి బతికే ఉన్నాడు.తాజాగా 9/11 దాడి జరిగి 20 ఏళ్ల పూర్తయిన సందర్భంగా అతడు ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు.అల్‌ఖైదా అధికారిక మీడియా అస్‌-సహబ్ ఈ 60 నిమిషాల వీడియోను పోస్ట్ చేసింది.ఒసామా బిన్ లాడె న్‌ ను అమెరికా మట్టుబెట్టిన తర్వాత అల్‌ఖైదా బాధ్యతలు తీసుకున్న జవహిరి.చాలాకాలంగా అండర్‌గ్రౌండ్‌లోనే ఉన్నాడు.గతేడాది నవంబర్‌లో అతడు అనారోగ్యంతో మరణించినట్లు కూడా వార్తలు వచ్చాయి.ఆ తర్వాత అతని నుంచి వీడియో బయటకు రావడంతో ఇప్పుడు అందరూ అవాక్కవుతున్నారు.శనివారం విడుదలైన ఈ వీడియోలో జవహిరి పూర్తి ఆరోగ్యంతో కనిపించాడు.సెప్టెంబర్ 11 ఉదయం నుంచీ కొన్ని టెలిగ్రామ్ చానెళ్లలో ఈ వీడియో వస్తోందంటూ అస్‌-సహబ్ ప్రోమోలు నడి పించింది.ఆ తర్వాత ఓ టెలిగ్రామ్ చానెల్ ద్వారానే జవహిరి రాసిన 852 పేజీల బుక్‌ను రిలీజ్ చేసింది అల్‌ఖైదా.ఈ 60 నిమిషాల వీడియోలో ఒక్కచోట మాత్రమే అ తడు ఆఫ్ఘనిస్థాన్ గురించి ప్రస్తావించాడు.20 ఏళ్ల యుద్ధం తర్వాత అమెరికా పూర్తిగా కుంగిపోయి మళ్లీ ఇంటిదారి పట్టిందని అన్నాడు.9/11 దాడుల్లో పాల్గొన్న 19 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులను అతడు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.అదే విధంగా సెప్టెంబర్ 11 దాడులకు 20 ఏళ్లు పూర్తి కావటంలో ఆప్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ భవనం పైన తాలిబన్లు తమ జెండా ఎగురవేసారు.వాస్తవంగా ఇదే రోజున తమ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించినా చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here