హైదరాబాద్:తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా అనితా రామచంద్రన్,పంచాయతీరాజ్ కమిషనర్గా శరత్,పరిశ్రమలశాఖ సంచాలకులుగా కృష్ణభాస్కర్,వ్యవసాయశాఖ కార్యదర్శిగా రఘునందర్రావు,యువజన సర్వీసులు సంచాలకులుగా వెంకటేశ్వర్లు,మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా అబ్దుల్ అజీం నియమితులయ్యారు.ఇక పలు జిల్లాల కలెక్టర్లు మారారు.కామారెడ్డి కలెక్టర్గా జితేశ్ పాటిల్,వికారాబాద్ కలెక్టర్గా నిఖిల,రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా అనురాగ్ జయంతి,నాగర్కర్నూల్ కలెక్టర్గా ఉదయ్కుమార్,జోగులాంబ గద్వాల కలెక్టర్ గా వల్లూరు క్రాంతి,వరంగల్ కలెక్టర్గా గోపి,జనగామ కలెక్టర్ శివలింగయ్య,మహబూబాబాద్ కలెక్టర్గా శశాంక నియామకమయ్యారు.