నిజాంను మించిన ధనికుడు కేసీఆర్:రేవంత్ రెడ్డి

హైదరాబాద్:టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్లీనరీ నిర్వహిస్తున్నారు.ఒకపక్క కేసీఆర్ ప్లీనరీ నిర్వహణ కొనసాగుతుంటే,మరోపక్క ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ ప్లీనరీలో తాను అడుగుతున్న ఇరవై ఒక్క ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కేసీఆర్ కు ప్రశ్నలను సంధించారు.ఇక ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.సిటీలో ఎక్కడ చూసినా టిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు,బ్యానర్లు,కటౌట్ లు కనిపిస్తున్నాయి అంటూ ఓ దిన పత్రికలో వచ్చిన వార్తను పోస్ట్ చేసిన టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,ప్లీనరీ కోసం కొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ కు అడ్డంగా ఫ్లెక్సీల ను ఏర్పాటు చేశారని ప్రచురితమైన వార్తల క్లిప్పింగ్ ను ట్విట్టర్లో పోస్ట్ చేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు.చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయి అంటూ పేర్కొన్న రేవంత్ రెడ్డి అమరవీరులు,ఉద్యమ కారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టిందని వ్యాఖ్యానించారు. అమరులు సాధించిన తెలంగాణాలో కెసీఆర్ కుటుంబ పాలన సాగుతుందని రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వా రా పేర్కొన్నారు.కేసీఆర్ కుటుంబాన్ని పాములతో పోల్చారు.
*నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించింది*
టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్కసారిగా ధనవంతులు అయ్యారని వ్యాఖ్యలు చేశారు.నాడు డొక్కు సైకిళ్లు,విరిగిన కుర్చీల నుండి నేడు నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించింది అని పేర్కొన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒక తరం తెలంగాణ విషాదం ఉందని వ్యాఖ్యానించారు.సీఎం కేసీఆర్,ఆ యన కుటుంబం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిజాంను మించిన ధనవంతులుగా మారి,రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్నారని,కానీ త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాల్లో విషాదమే ఉందని పేర్కొన్నారు.అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణాలో కేసీఆర్ కుటుంబ వైభోగం తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంతోమంది యువకులు,తెలంగాణ సబ్బండ వర్ణాల ప్రజలు సకల జనుల స మ్మె చేసి,ప్రాణాలను త్యాగం చేసి,తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే సీఎం కేసీఆర్ కుటుంబం వైభోగం వెలగబోస్తోందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఇదిలా ఉంటే గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పి టీఆర్ఎస్ ప్లీనరీలో భారతీయ రాష్ట్ర సమితి అంటూ కొత్త విషయాన్ని తెరమీదకు తెచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here