ఉప ఎన్నికల ఫలితాలు.. ఏ స్థానంలో ఎవరు గెలిచారు?

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా ఇటీవల ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.మూడు పార్లమెంట్ స్థానాలకు,ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.పంజాబ్,ఉత్తర ప్రదేశ్,ఆంధ్ర ప్రదేశ్,త్రిపుర,ఝా ర్ఖండ్,ఢిల్లీ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.పంజాబ్‌లోని సంగ్రూర్,ఉత్తర ప్రదేశ్‌లోని అజాంఘర్,రాంపూర్ లోక్‌సభ స్థానాలకు,మిగతా రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.ఆదివా రం వీటి ఫలితాలు వెలువడ్డాయి.ఢిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది.ఇక్కడ బీజేపీపై ఆప్ విజయం సాధించింది.ఈ ని యోజకవర్గం గతంలో ఆప్ చేతిలోనే ఉండేది.ఇక్కడ్నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రాఘవ్ చద్దా రాజ్యసభకు వెళ్లడంతో,ఆ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది.దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించగా,తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీనే ఈ స్థానాన్ని దక్కించుకుంది.ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార వైసీపీ గెలుపొందింది.ఇక్కడ అంతకుముందు ఆ పార్టీ నుంచి ఎ మ్మెల్యేగా ఉన్న గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందారు.దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగగా,ఆయన కుటుంబ సభ్యుడైన విక్రమ్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు.ఝార్ఖండ్‌లోని మందార్ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శిల్పి నేహా తిర్కి గెలుపొందారు.బీజేపీ అభ్యర్థిపై శిల్పి ఘన విజయం సాధించారు.త్రిపురలోని అగర్తాలా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రె స్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మాన్ గెలుపొందారు.బీజేపీ అభ్యర్థి అశోక్ సిన్హాపై సుదీప్ రాయ్ విజయం సాధించారు.త్రిపురలోని జుబరాజ్ నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ విజయం సాధించింది.సీపీ ఎం అభ్యర్థిపై బీజేపీకి చెందిన మలినా దేవ్‌నాథ్ గెలుపొందారు.త్రిపురలోని సుర్మ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి స్వప్న గెలుపొందారు.త్రిపుర రాష్ట్రంలో అత్యంత కీలక ఎన్ని కగా భావించిన బర్దోవాలి నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర సీఎం మాణిక్ సాహా (బీజేపీ) విజయం సాధించారు.ఆయన సీఎంగా కొనసాగుతున్నప్పటికీ అసెంబ్లీలో స్థానం లేదు.దీంతో తాజా ఉప ఎన్నిక లో గెలిచారు.లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమైంది పంజాబ్‌లోని సంగ్రూర్ నియోజకవర్గం.ఇక్కడ ఎంపీగా ఉన్న భగవంత్ మన్,తాజాగా అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచి,సీఎం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ స్థానం ఖాళీ అయింది.తాజాగా జరిగిన ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ స్థానాన్ని కోల్పోయింది.ఇక్కడ శిరోమణి అకాళీ దళ్ నేత గెలుపొందారు.ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద షాక్.అధి కారంలో ఉండి కూడా,సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది.తర్వాత ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించింది.బీజేపీ అభ్యర్థి ఘన్ శ్యామ్ సింగ్ లోధి గెలుపొందారు.మరో లోక్‌సభ నియోజకవర్గం అజాంఘర్ నుంచి కూడా బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ గెలిచారు.తాజా లోక్‌సభ ఎన్నికల్లో రెండు బీజేపీ గెలుచుకోగా,ఒక స్థానా న్ని శిరోమణి అకాళీ దళ్ సొంతం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here