మాజీ కలెక్టర్‌కు మరో షాక్..ఆయన నామినేషన్‌ రద్దుపై పిల్

హైదరాబాద్:సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంకట్రామిరెడ్డి వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఆయన గత సోమవారం రాజీనామా చేయడం.ఆ రాజీనామా సాయంత్రానికి ఆమోదం పొందడం మరుసటి రోజే ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చకచకా జరిగి పోయాయి.అయితే ఆయన ఎంపికపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఘాటుగా స్పందించారు.అవినీతి ఆరోపణలు,రాష్ట్రపతి వద్ద ఫిర్యాదులు ఉన్న వెంకట్రామిరెడ్డి రాజీనామా ఎలా ఆమోదిస్తారని ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని కోరుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా కీలక నేతలు రిటర్నింగ్ అధికారికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయెల్‌ని కలిసి ఫిర్యా దు కూడా చేశారు.మరోవైపు ఆయన రాజీనామాను రాష్ట్ర సీఎస్ అమోదించే అవకాశం లేదని కేంద్రం పరిధిలో ఉండే ఐఎఎస్ అధికారుల రాజీనామాను డీవోపీటి అమోదించాల్సి ఉంటుం దని అయన చెప్పారు.దీంతో ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.అయితే ఓవైపు వెంకట్రామిరెడ్డి నామినేషన్‌పై రాజకీయ విమర్శలు చెలరేగుతుండగానేఆయనకు మరో షాక్ తగిలింది ఆయన రాజీనామా ఆమోదంపై హైకోర్టులో పిల్ ధాఖలైంది.కేంద్ర సర్వీసు అయిన ఐఏఎస్‌ రాజీనామాని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడమేంటని సవాల్ చేస్తూ తెలం గాణ హైకోర్టులో రీసెర్చ్ స్కాలర్ సుబేందర్ సింగ్,జె.శంకర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.తమ పిటిషన్‌లో ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని పిటిషనర్లు తెలిపారు.చట్టం ప్రకారం ఒక ఐఏఎస్ అధికారి రాజీనామా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్‌తో కేంద్రానికి సిఫార్సు చేయాల్సి ఉంటుందని పేర్కోన్నారు.రాజీనామా లేదా వాలంటరీ రిటైర్‌మెంట్‌ చేసే అధికారులు మూడు నెలల ముందుగానే నోటిసులు ఇవ్వాలని పేర్కొన్నారు.అయితే ఎమ్మె ల్సీగా ఎన్నిక కానున్న వెంకట్రామిరెడ్డి రాజీనామా చేసిన రోజే చీఫ్ సెక్రటరీ అమోదించినట్టు చెప్పారని,ఈ క్రమంలోనే ఆయన నామినేషన్‌ స్వీకరించడం శాసన మండలి రిటర్నింగ్ అధి కారి అమోదించడం చట్టవిరుద్దమని పేర్కోన్నారు.కాగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు డీవోపిటీ తోపాటు శాసనసభ కార్యదర్శి,ఇతర అధికారులను ప్రతివాదులుగా చేర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here