కెసిఆర్,హరీష్ రావు లకు సవాల్ విసిరిన:ఈటల

హన్మకొండ:కమలాపూర్ మండల కేంద్రంలో ఉమామహేశ్వరి గార్డెన్స్ లోఈటెల అధ్వర్యంలో బీజేపీలో చేరిన ఉప్పల్,దేశరాజ పల్లి కి చెందిన పలువురు కాంగ్రెస్ నేత లు,తెరాస నేతలు.కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరారు.ఈ సందర్భంగా ఈటలరాజేందర్ మాట్లాడుతూ 18 సంవత్సరాల తరువాత అనేక మంది మంత్రులు ఇక్కడికి వ స్తున్నారు.పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు,mlc లు వస్తున్నారు.గొర్ల మంద మీద తోడేళ్ళు పడ్డట్టు,పంట పొలాలమీద మిడతల దండులా పడ్డారు.నన్ను మధ్యలో వచ్చి మధ్యలో పోతున్నా అంటున్నారు.నేను 18 ఏళ్లు పని చేస్తే హరీష్ రావు నువ్ పద్దెనిమిదిన్నర సంవత్సరాలు పని చేసి ఉండవచ్చు.కానీ నువ్వు మాట్లాడే మాటలు చూసి తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు.నేను ఇక్కడ అభివృద్ధి చెయ్యలేదు అని హరీష్ రావు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నావు.ను వ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నావు కదా నీ నియోజకవర్గంలో ఎన్ని నిధులు ఖర్చు అయ్యాయి,నా నియోజకవర్గంలో ఎన్ని ఖర్చు అయ్యాయి బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ హరీష్ రావు కి సవాలు విసిరిన ఈటల రాజేందర్.మీ మామ ఆదేశాలతో నా బొందిగ పిసకాలని నా దగ్గరికి వచ్చావు ఏదో ఒక రోజు నీ బొందిగ కూడా పిస కడం ఖాయం.మర్చిపోకు హరీష్ రావు మర్చిపోకు.హరీష్ నువ్వు నేను కలిసి ఎన్ని సార్లు ఎడ్చినమో తేదీలతో సహా సమయం వచ్చినప్పుడు చెప్తా.పదవులకోసం పెదవులు మూసి నీసహచర ఉద్యమ కారుడు మీద పిచ్చి కూతలు కూస్తే పలచపడి పోతావు హరీష్.కెసిఆర్ నువు నన్ను కుడి బుజం అన్నావు,తమ్ముడు అన్నా వు.ఆనాడు గొప్పొన్ని ఎట్లా అయ్యాను.ఇప్పుడు దయ్యాన్ని ఎట్లా అయ్యాను చెప్పగలవా కెసిఆర్.కెసిఆర్ గారు మీకు ఉప్పల్ వేదిక మీదుగా సవాలు విసురుతున్న ఢిల్లీ సర్కారు మెడలు వంచిన దాంట్లో నా ఉప్పల్ రైల్ రోకో ప్రధాన పాత్ర పోషించింది.నేను ఢిల్లీ లోని కేంద్ర రైల్వే కార్యాలయంలో ఉప్పల్ చరిత్ర ఉంది కెసిఆర్.ఉప్పల్ రైల్వే పట్టాల మీద 72 గంటలు పడుకుంది మేము,కేసులు ఎదుర్కొంది మేము కాదంటావా ? బరిగీసి కొట్లడిన బిడ్డలం.నువ్వు ఇంట్లో కూర్చొ ని ప్లాన్ చేస్తే తెలంగాణ రాలేదు.యావత్ తెలంగాణ పోరాటం చేస్తే వచ్చింది.1200 మంది బిడ్డల్ని త్యాగం చేసింది తెలంగాణ.దానికి చలించిన కేంద్రం తెలంగాణ ఇ చ్చింది.ఈ తెలంగాణలో నా పాత్ర కూడా ఉంది.నేను ఏమి అడిగిన డబుల్ బెడ్రూం లు ఎవరి జాగాలో వారిని కట్టుకొనిద్దం అని డిమాండ్ చేయడం తప్పా.హరీష్ రా వు,కడియం,తుమ్మల నేను కలిసి కెసిఆర్ గారికినే ప్రతిపాదన పెట్టినం.మన నియోజక వర్గంలో 2000 ఇల్లు కడుతున్నం కానీ ఎం సరిపోతాయి.నీకు నిజాయితీ ఉంటే ఎవరి జాగాలో వా రికి ఇళ్లు కట్టుకొనే GO ఇవ్వు.ఐకేపీ సెంటర్స్ ఉండాలి,వడ్లు కొనాలి అని డిమాండ్ చేయడం తప్పా మంత్రి నే అయినా ప్రజలు ఎం కోరుకుం టారో చల్లురు సభలో చెప్పిన.నా ప్రజల పక్షాన ఉన్నాను నేను.మక్కలు ప్రభుత్వం కొనకపోతే క్వింటాల్కు 1350 రూపాయలు వచ్చాయి,అదే కొన్నట్లయితే 1850 రూపాయలు వచ్చే వి.ఒక్క ఎకరానికి 15 వేల రూపాయలు రైతు నష్టపోయాడు.నువ్వు రైతు బందు ఇచ్చింది 5 వేలు.రేటు వస్తె ఆ నష్టం జరిగేది కాదు కదా ? పెన్ష న్ కు తాళం వే శాడు కెసిఆర్.నా వల్ల ఇప్పుడు ఆ తాళం ఓపెన్ అయ్యింది.రేషన్ కార్డ్ 4 ఏళ్లుగా లేవు.దీనికి తాళం వేసిండు.కరోనా తో చచ్చి పోతుంటే నాకుటుంబా న్ని పక్కన బె ట్టి ప్రజల కోసం నేను కష్టపడుతుంటే నా మీద కుట్ర చేసి టీ న్యూస్ లో ప్రచారం చేసి బుకాబ్జా చేశాను అని 8 గంటల్లో మంత్రి పదవి తీసివేసిండు కెసి ఆర్.సరే పోనీ అనుకుంటే లేచినొడు లేవనొడు అందరూ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేయమన్నాడు.ఇజ్జత లేని దగ్గర ఎందుకు అని రాజీనామా చేసి మీ దగ్గరికి వచ్చిన.కెసిఆర్ సిగ్గు లేకుండా ఇలా చేశాడు.మొత్తం ఆస్తి అయినా అమ్మండి కెసిఆర్ మీద కొట్లాడండి అని నా భార్య చెప్పింది.2001 లో నా ఆస్తి ఎంతో చెప్తా నీ ఆ స్తి ఎంతో చెప్పు.నా భార్య పిల్లలు ఈ రోజు కూడా సద్ది కట్టుకొని పోయి పని చేసుకుంటారు.నువ్వు నీ కుటుంబం ఎం వ్యాపారం చేస్తుంది.ఎలా ఇన్ని వేల కోట్ల రూపా యలు వచ్చాయి చెప్పగలవా కెసిఆర్.ఉద్యమంలో ప్రజలను నమ్ముకున్నవు నీ వెంట నడిచారు.కానీ ఈ రోజు డబ్బుని,కుట్రను నమ్ముకున్నావు.నీ చపు కుతంత్రా లు నమ్ముకున్నవు.ప్రజలు అమాయకులు కాదు,నిన్ను బొంద పెడతారు.సొంత పార్టీ నాయకులను కొనే నీచ సంస్కృతికి దిగాడు కెసిఆర్.అంగట్ల సరుకా వాళ్ళు.ఓ టుకు 20 వేలు ఇస్తాడట.డబ్బులతో ఆత్మగౌరవాన్ని కొనగలవా కెసిఆర్.తెలంగాణ ఆకలిని అయినా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని కొల్పొదు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కెసిఆర్ ను ఓడగొట్టలని వంద కోట్లు ఖర్చు పెట్టాడు.కానీ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు.ఇప్పుడు కూడా కెసిఆర్ ఇచ్చే డబ్బులు తీసుకొని ధర్మానికి ఓటు వేయండి.హుజూరాబాద్ మొత్తం తెలంగాణ కు ఆదర్శం కాబోతుంది.అందరూ ఈటల రాజేందర్ కి ఓటు వేయండి అని కోరుతున్నారు.నిరుద్యోగ యు వకుల బ్రతుకు మారాలంటే కెసిఆర్ ఒడిపోవాలి.యువతను పోలీసులు,ఇక్కడికి వచ్చిన వారు బెదిరిస్తున్నారు.ఎవరిని బెదిరిస్తవరా నువ్వు,ఎంత మందిని బేదిరిస్త వు నువ్వు.ఈ గడ్డ మీద పుడితే నీకే ఓటు వేయాలా ? ఈటెల రాజేందర్ ఓడిపోతే నే నా పార్టీ పటిష్ఠంగా ఉంటుంది అని కెసిఆర్ ఇక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు.హై దరాబాద్ లో భూములు అమ్మి హుజూరాబాద్ లో దలితబందు ఇస్తున్నారు.పేదరికానికి కులం లేదు.అందుకే ప్రతి పేదవాడికి 10 లక్షలు ఇవ్వాలి.ఎమ్మెల్యేల్లారా ? మీరు నా దగ్గరికి వచ్చి ప్రచారం చేస్తున్నారు రేపు నేను మీ దగ్గరికి వస్తా మీ బ్రతుకులు ఎండగడతా.దమ్ముంటే కెసిఆర్ నా? హరీష్ నా ? ఎవరు నిలబడతారు చె ప్పండి.నీ పోలీసులని,అధికారులను,మంత్రులను,డబ్బులు ఆపు కొనుగోళ్లు ఆపి ప్రచారం చెయ్యి నువ్వు గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా. దమ్ముందా? శక్తి పైసలతో రాదు ప్రజా బలంతో వస్తుంది.నేను సాయం చేసిన వారు,నా ప్రజలు నన్ను కాపాడుకుంటారు.హుజూరాబాద్ ఎడ్డిది కాదు.చైతన్యవంతమై న గడ్డ.కెసిఆర్ ఇంకా చెల్లదు నీ మోసం.ఇండియా టుడే సర్వే తేల్చింది.84 శాతం ప్రజలు నిన్ను నమ్మడం లేదని ఈటెల అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here