జమ్మికుంట:మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు.అధిక బరువు తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు.అధిక బరువు సమస్య నుంచి బయట పడాలి అంటే ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగాలంటే,నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరగాలంటే అధిక పొట్ట తగ్గాలంటే ఇప్పుడు చెప్తే చిట్కా ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితం కనబడుతుంది.మన వంటింట్లో ఉండే జీలకర్ర బరువు తగ్గించడానికి చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.అలాగే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతుంటారు.పొయ్యి మీద గిన్నె పెట్టి వెలిగించి ఒక గ్లాస్ నీటిని పోసి 4 లేదా 5 మిరియాలను దంచి వేయాలి.ఆ తర్వాత అరస్పూన్ జీలకర్ర వేసి 2 నిమిషాలు మరిగాక పావుస్పూన్ లో సగం పసుపు వేసి మరో 2 నిమిషాలు మరిగించాలి.మరిగిన ఈ కాషాయన్ని గ్లాస్ లోకి వడకట్టి ఉదయం సమయంలో పరగడుపున తీసుకోవాలి.గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తాగకూడదు.బ్రేక్ ఫాస్ట్ చేయటానికి అరగంట ముందు లేదా తర్వాత తాగాలి.ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.