సాగర్ టీఆర్ఎస్ ఇంఛార్జీలు వీరే..

నాగార్జునసాగర్:నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ దిగ్గజం జానారెడ్డిని ఢీకొట్టేందుకు సరైన అభ్యర్థి కోసం చివరిదాకా సర్వేలపై సర్వేలు చేసిన సీఎం కేసీఆర్‌ దివం గత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కే టికెట్‌ కేటాయించారు.మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు నోముల భగత్.ఇక అభ్యర్థి ప్రకట న ఆలస్యమైనప్పటికీ ప్రచారంలో ముందుంది టీఆర్ఎస్.టీఆర్ఎస్ పార్టీ మండలాల వారీగా నియమించిన ఇంఛార్జీలను పరిశీలిస్తే తిరుమలగిరికు రమావత్‌ రవీంద్రకు మార్‌ (దేవరకొండ ఎమ్మెల్యే)హాలియా పట్టణానికి కోరకంటి చందర్‌ (రామగుండం ఎమ్మెల్యే)పెద్దవూరకు బాల్క సుమన్‌ (చెన్నూర్‌ ఎమ్మెల్యే) గుర్రంపోడ్‌కు కంచర్ల భూపాల్‌రెడ్డి (నల్గొండ ఎమ్మెల్యే)నిడమనూరుకు నల్లమోతు భాస్కర్‌రావు(మిర్యాలగూడ ఎమ్మెల్యే)త్రిపురారానికి బాణోత్‌ శంకర్‌నాయక్‌ (మహబూబాబాద్‌ఎమ్మె ల్యే)అనుముల మండలనికి కోనేరు కోనప్ప (సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే)సాగర్‌ పురపాలికకు సునీల్‌రావు (కరీంనగర్‌ మేయర్‌)లను ఇంఛార్జీలు గా ఉన్నారు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్.సాగర్ ఎన్నికల్లో గెలుపు ద్వారా తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని గులాబీ బాస్ గెలుపు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

Nagarjuna Sagar Dam, Nalgonda | DestiMap | Destinations On Map

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here