RRR సినిమా రాజమౌళి రెమ్యూనేషన్ ఎంతో తెలిస్తే….

తెలంగాణవాణి
తెలంగాణవాణి

తెలంగాణ వాణి హైదారాబాద్: బాక్సాఫీస్‌ దగ్గర ఓటమి ఎరుగని ధీరుడు.. ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచిన గొప్ప  డైరెక్టర్‌  ఎస్‌. ఎస్‌ రాజమౌళి. ఆయన నుంచి ఒక సినిమా వచ్చిందంటే.. అది కచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ కొట్టాల్సిందే. తీసింది తక్కువ సినిమాలే అయినా..ప్రతీది ఒక అద్భుత కళాఖండమే. బాహుబలి చిత్రం అయితే.. ఏకంగా 2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. ఇండియన్‌ మూవీస్‌ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసింది. అంతేకాదు బాహుబలి తర్వాత టాలీవుడ్‌ తలరాతే మారిపోయింది. మన సినిమాల​కు పాన్‌ ఇండియా స్థాయిలో మార్కెట్‌ పెరిగింది. ఒకప్పుడు బాలీవుడ్‌ చిత్రాలను టాలీవుడ్‌లో రీమేక్‌ చేసేవారు. కానీ ఇప్పుడు మన చిత్రాలను బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. ఈ మార్పుకి అంతో ఇంతో కారణం రాజమౌళి అనే చెప్పాలి.

ఇప్పుడు ఈ దర్శకధీరుడు తెరకెక్కించిన మరో పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌.  ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కోసం జక్కన్న చాలా కష్టపడ్డారు. కొవిడ్ కష్టాలను ఎదుర్కొంటూ సూమారు నాలుగేళ్లపాటు ఈ మూవీని తెరకెక్కించాడు. అయితే కష్టానికి తగినట్లే.. రెమ్యునరేషన్‌ కూడా భారీగానే తీసుకుంటాడట రాజమౌళి.

ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ దాదాపు రూ. 80 కోట్లకు పైగానే పారితోషికం అందించిందని సమాచారం. ఇండియాలో ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక డైరెక్టర్ రాజమౌళి మాత్రమే కావడం గమనార్హం. మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్‌ లాభాల్లో 30 శాతం వాటా కూడా అడిగినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. రాజమౌళికి మూడు వందల కోట్లకు పైనే రెమ్యునరేషన్‌ రూపంలో వస్తుంది. ఇక ఈ సినిమాల్లో నటించిన ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లకు ఒక్కొక్కరికి రూ.45 కోట్లను రెమ్యునరేషన్‌గా అందించినట్లు సమాచారం. 

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ విషయానికొస్తే.. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నటీనటుల సంగమంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు రాజమౌళి. టాలీవుడ్‌ నుంచి ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, బాలీవుడ్ నుంచి ఆలియాభట్, అజయ్ దేవగన్ తోపాటు హాలీవుడ్ నటీనటులు ఒలివియో మోరీస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్ లు సందడి చేయబోతున్నారు. వీరితోపాటు అరుణ్ సాగర్, శ్రియా శరణ్, ఛత్రపతి శేఖర్, రాజీవ్ కనకాల, సముద్రఖనిలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. మార్చి 25న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here