కాళేశ్వరం పంప్ హౌస్ పనులను వేగం చేయాలి:సీఎంఓ కార్యదర్శి స్మితసబర్వాల్

కరీంనగర్:కరీంనగర్ ఉమ్మడి జిలాల్లో చేపడుతున్న కాళేశ్వరం పుంపుహౌస్ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితసబర్వాల్ అధికారులను అధికారులను ఆదేశించారు.సోమవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మరియు పెగడపల్లి మండలం నామపూర్ గ్రామంలోని పంప్ హౌస్ పనులను పర్యవేక్షించి కరీంనగర్ ఉమ్మడిజిల్లా కాళేశ్వరం,పంప్ హౌస్ పనులపురోగతిపై కలెక్టర్లు,ఇరిగేషన్ అధికారులు మరియు గుత్తే దారులతో పనుల పురోగతిపై సమీక్షించారు.ఈ సంద ర్బముగా స్మితసబర్వాల్ మాట్లాడుతూ పనులు మందకొడిగా సాగుతున్నాయని నిర్దేశించిన సమయంలోగా పనులను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.ఎప్పటికప్పు డు పనులను పర్యవేక్షించి పనులు పురోగతిలో ఉండేలా చూడాలని అన్నారు.అదేవిదంగా పనుల పురోగతి,పనుల నాణ్యత ప్రమాణాలను నివేదిక రూపంలో అందించాలని అధికారులను ఆదేశించా రు.పనుల నాణ్యతలో రాజీపడరాదని,సకాలంలో పనులను పూర్తిచేసేలా ప్రణాళికనూ రూపొందించుకొవాలని అన్నారు.ప్రతి 3 నెలలకు ఒకసారి పనులు పర్యవేక్షించి నివేదికను పంపించాలని అధి కారులను ఆదేశించారు.
ఇరిగెషన్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ మాట్లాడుతూ,పనులలో ఖచ్ఛితమైన నాణ్యత ప్రమాణాలను పాటించాలని,పనులకు అవసరం మేర కూలీలు,మిషనరీ,కాంక్రీట్,స్టీల్ మొదలగు వా టిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు.నిర్దేశించిన సమయంలోగా పనులను పూర్తీ చేయాలని గుత్తేదారులు ఆదేశించారు.పనులకు సంబంధించి అధనపు నిధుల మంజూరుకు కృషి చేస్తానని అన్నారు.వివిధ ప్రాజెక్టు పనులకు సంబంధించి నివేధికలను పంపించి అధనపు నిధుల కొరకు మళ్ళి నివేధికలు పంపిస్తున్నారని,ఆలా జరగకుండా ఆర్ అండ్ ఆర్ నివేదికలను పంపించే టప్పుడు క్రిందిస్థాయి అధికారులపై ఆధారపడకుండా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఒకటికి రెండుసార్లు పరిశీలించి పర్యవేక్షించాలని సూచించారు.పనులను సకాలంలో పూర్తిచేయాలని,ఇబ్బందులు ఎదు రైతే తన దృష్టికి తీసుకు వచ్చినట్లయితే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే తో కలిసి నారాయణపూర్,చర్లపల్లిలో ప్రాజెక్టు పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా భూనిర్వాసితులు కో ల్పోయిన భూములకు బదులు ఎక్కడైనా భూములను ఇప్పించాలని కోరగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ను పరిశీలించాలని సూచించారు.చొప్పదండి నియోజవర్గంలో చేపడుతున్న పనులకు ఎదురయ్యే ఇబ్బందులను త్వరగా పరిష్కరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్,కరీంనగర్,జగిత్యాల,సిరిసిల్లా జిల్లాల కలెక్టర్లు ఆర్.వి.కర్ణన్,జి.రవి,అనురాగ్ జయంతి లు మరియు అదనపు కలెక్టర్ లు,ఆర్డీఓ లు,ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here