అమిత్‌ షా,యోగిలకు..బెదిరింపులు..!

న్యూఢిల్లీ:కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ సీఆర్పీఎఫ్‌కు బెదిరింపు ఈ-మెయిల్‌ రావడం కలకలం రేపింది.ఇందు కో సం 11మంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నట్టు ఆ ఆగంతకులు ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.ప్రార్థనా స్థలాలు,కీలక ప్రాంతాల్లోనూ దాడులు చేస్తామని హె చ్చరించారు.ఈ మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ బెదిరింపు ఈ-మెయిల్‌ మూడు రోజుల క్రితం ముంబయిలోని సీఆర్పీఎఫ్‌ ప్రధాన కార్యాలయానికి వ చ్చినట్టు సమాచారం.దీన్ని మహారాష్ట్రతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత సంస్థలకు పంపించినట్టు సీఆర్పీఎఫ్‌ డీజీపీ కుల్దీప్‌ సింగ్‌ వెల్లడించారు.దీనిపై దర్యాప్తు జరుగుతోందని,ఆయా సంస్థల ఆదేశాల మేరకు తాము ముందుకెళ్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here