హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు,5000 రూపాయల జరిమాన, మరొకరికి సంవత్సర జైలు శిక్ష,1500 జరిమాన….

హత్యకేసులో ఒకరికి జీవిత ఖైదు తో పాటు 5000 రూపాయల జరిమానా,మరొకరికి సంవత్సర జైలు శిక్ష,1500 రూపాయల జరిమాన విధిస్తూ II Addl.District sessions Judge  శ్రీ సుదర్శన్ తీర్పు వెల్లడి…

తాజాకబురు
తాజాకబురు

తాజాకబురు, :జగిత్యాల జిల్లా  రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్ల కొండ పూర్ గ్రామానికి చెందిన పల్లికొండ  లక్ష్మీ కి ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. ఆస్తి పంపకాల విషయంలో లో, చిన్న కూతురు రోజా పెండ్లికి సంబంధించి విషయం లో తల్లి లక్ష్మీ కి కొడుకు అశోక్ కు తరుచు గిడవలు జరుగుతూ ఉండేవి ఈ ఆస్థి విషయం గురించి ఊరు పెద్దమనుషుల సమక్షంలో చాలాసార్లు లో పంచాయతీ లు నిర్వహించారు. ఆస్తి పంపకాల విషయంలో తన చెల్లె రోజా, అమ్మ తల్లి లక్ష్మీ పై కక్ష పెంచుకున్న కొడుకు అశోక్ తేదీ 16-05-2015 రోజున రోజా పై అశోక్ రోకలి బండ తో దాడి చేయగా రక్తపు మడుగులో పడి ఉన్న రోజును స్థానికుల సహాయంతో తల్లి లక్ష్మి జగిత్యాల  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా  చికిత్స పొందుతూ  రోజా మరణించింది..

రోజా తల్లీ  లక్ష్మీ ఫిర్యాదు మేరకు రాయికల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులైన  పల్లి కొండ అశోక్, పల్లికొండ భూలక్ష్మి  లను కోర్టులో హాజరు పరిచారు.కేస్ ను విచారించిన న్యాయమూర్తి శ్రీ సుదర్శన్  నిందితులలో ఒకరు  అయిన అశోక్ కు జీవిత ఖైదు తో పాటు5000/- రూపాయల జరిమానా, మరియు  సహాయ చేసినందుకు అశోక్ యొక్క భార్య భూ లక్ష్మీ కి సంవత్సర జైలు శిక్ష, 1500/-రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

ఈ కేస్ లో Addl.పీపీ గా శ్రీవాణి , ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా  సరిలాల్, విజయరాజ్, సురేందర్, రాజశేఖర్ రాజు CMS SI రాజు నాయక్, కోర్ట్ కానిస్టేబుల్ నవీన్, మరియు CMS కానిస్టేబుల్ కిరణ్ లు నిందితుల కి శిక్ష పడడం లో గౌరవ కోర్టుకు సాక్షాధారాలు అందించడం లో  ప్రముఖ పాత్ర వహించడం జరిగింది.

పై కేస్ లో నిందితులు  పల్లికొండ అశోక్ ,పల్లికొండ భూ లక్ష్మీ లకు కు  శిక్ష పడటం  పడటం లో కృషి చేసిన పోలీసు అధికారుల ను జిల్లా ఎస్పీ శ్రీమతి సింధుశర్మ ఐపిఎస్ గారు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here