ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని సామాజిక బాద్యతగా గుర్తించాలి – జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల తాజా కబురు:కరోనా వైరస్, కోవిడ్-19 ప్రభావంతో గత మార్చి నెల నుండి మూసివేసిన పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, కమ్యూనిటి హల్లలో ప్రత్యేక సానిటేషన్ కార్యక్రమాలను గ్రామ ప్రజలు, యువత సామాజిక బాద్యత గుర్తించి శుభ్రపరిచే కార్యక్రమంలొ ప్రతిఓక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జి. రవి తెలిపారు. జిల్లా విద్యాశాఖ, ప్రత్యేక అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్-19 కారణంగా మూసివేసిన పాఠశాలలు, నేడు, రేపు, ఎల్లుండి యుద్దప్రాతిపదికన ప్రజాప్రతినిధులు, ప్రజలు, వార్డుమెంబర్లు, సర్పంచులు, పాఠశాలల్లో చదివే పిల్లల తల్లితండ్రులతో పాటు ఓల్డ్ స్టూడెంట్స్ ను బాగస్వాములను చేసి తరగతిగదులు, బెoచీలు, ప్లోరింగ్, తలుపులు, కిటికిలు, పాఠశాల పరిసరాలలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్ల పొదలు, శుభ్రపరచడంలో ప్రత్యేక అధికారులు దృష్టిసారించాలని తెలిపారు., జిల్లాలోని ప్రతిపాఠశాలను మన ఇంటిలా శుభ్రంగా ఉండేలా చూడడంతో పాటు పరిసరాలలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలని సూచించారు. కొన్ని చోట్ల సర్పంచులు శుభ్రపరుస్తున్నారని, అదేస్పూర్తితో మిగిలిన పాఠశాలలను కూడా శుభ్రపరిచే కార్యక్రమంలో ముందుండేలా చూడాలని తెలిపారు., ఆయా మండలాల వారిగా చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాల ప్రగతిని , ఈ ప్రోగ్రాం పై స్పందనను, ఫీడ్ బ్యాక్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతిఒక్కరిని బాగస్వాములను చేసి, ప్రణాళిక ప్రకారం పూర్తిచేసేలా ప్రోత్సహించాలని సూచించారు., పాఠశాలలను ప్రారబించడానికి వారంముందుగా ఇతర పెయింటింగ్ పనులు చేయాలని, పాఠశాలల వారిగా కమ్యూనిటి ప్లాoటేషన్ ద్వారా నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. యంఇఓ లు, టీచర్లు పాఠశాలలు పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గోన్నాలని ఆదేశించారు.ప్రజలు సామాజిక బాధ్యతగా తీసుకోని శ్రమదానం కార్యక్రమం చేసేలా చర్యలు తీసుకోవాలని, యంపిడిఓ, యంపిఓ, పంచాయితి సెక్రటరిలు అవసరం ఉన్నచోట మిషనరితో పనులు త్వరగా చేసేలా చూడాలని తెలిపారు. పాఠశాలకు సంబంధించి తాళాలు ఎవరిదగ్గర ఉంటాయో వారు అందుబాటులొ ఉండేలా చూడాలని తెలిపారు. అందరు ఒక్కేచోట ఉండి చేయకుండ ప్రాంతాల వారిగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నేడు, రేపు 2 రోజులు పనులు టీమ్ వర్క్ గా పూర్తి చేయాలని తెలిపారు., అంతకుముందు ఉదయం జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, చల్గల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మరియు రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మీక తనిఖీలు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పాఠశాలల పరిశుభ్రత కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు.,ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి. రాజేషం, స్థానిక సంస్థల అడిషన్ కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీ, కోరుట్ల ఆర్డిఓ వినోద్ కుమార్, విద్యాశాఖ అధికారి, ప్రత్యేక అధికారులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here