సీజనల్ నాయకుడు మధుయాష్కీఎమ్మెల్సీ కవితను విమర్శించే హక్కు లేదు

సీజనల్ నాయకుడు మధుయాష్కీ
ఎమ్మెల్సీ కవితను విమర్శించే హక్కు లేదు

శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ మాజీ ఎంపీ మధుయాష్కీ కాలం కి ఒకసారి వచ్చే వ్యక్తి అని, నిరంతరం ప్రజల్లో ఉండే ఎమ్మెల్సీ కవిత గారిని విమర్శించే నైతిక హక్కు మధుయాష్కికి ఏ మాత్రం లేదని విమర్శించారు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్లు, నిధులు,నియామకాలు కోసమని,తాగు,సాగు నీటి కోసం ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు…5000 వేల కోట్ల తో మిషన్ కాకతీయ ద్వారా ప్రతి నీటిబొట్టుని ఒడిసి పట్టి సాగునీటిని,అందించారని,నియోజకవర్గంలో సైతం నాలుగు కోట్లతో అనేక గ్రామాల్లో చెక్ డ్యాం లు నిర్మించామన్నారు..ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం కట్టిన ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు..రైతుల మోసం
గడిచిన ఏడు సంవత్సరాల కాలంలో కేంద్రం ఒక్క గోదాం కట్టలేదన్నారు…సంవత్సర కాలంలో సీజన్ వారిగా కనపడే నాయకుడు మధుయాష్కీ అని,ఆయన ఏం అభివృద్ధి చేసాడో అందరికి తెలుసు అని అన్నారు…ఎమ్మెల్సీ కవిత ఎంపీగా ఉన్న సమయంలో పసుపు బోర్డ్ కోసం ఎక్కని మెట్టు లేదు, కలవని ముఖ్యమంత్రులు లేరని,ఈ విషయాన్ని మధుయాష్కీ తెలుసుకోవాలన్నారు…
నిజామాబాద్ చెరుకు ఫ్యాక్టరీ కోసం మీరు ఎంపీగా ఉన్నపుడు ఏం చేశారని ప్రశ్నించారు..నిరంతరం ప్రజల్లో ఉండే ఎమ్మెల్సీ కవిత గారిని కాలం కి ఒకసారి వచ్చే మాధుయాష్కీ గారికి విమర్శించే హక్కు లేదని, వీలైతే రైతుల కోసం మీ మిత్రుడు రాహుల్ గాంధీ తో మాట్లాడి రైతుల పక్షాన నిలవాలసిందిగా కోరారు…
ఈ కార్యక్రమంలో జగిత్యాల,రాయికల్ పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్,ఇంతియాజ్,పట్టణ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజహిధ్,పార్టీ మండల అధ్యక్షులు బాల ముకుందం, కోల శ్రీనివాస్,నారాపాక రమేష్, గుర్రాల రాజేందర్ రెడ్డి ,పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనందరావు నాయకులు సురేష్ తదితరులు పాల్గోన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here