గ్రీన్ ఇండియా చాలెంజ్ ను విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల, ఫిబ్రవరి 13 తాజా కబురుప్రతినిధి: ఈ నెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టనున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామపంచాయితీలలో వేయి మొక్కలను నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం లోని అంబారిపేట, చల్గల్, రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామాలలో గ్రీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉపాధిహామీ కూలీల ద్వారా సామూహిక మొక్కలు నాటే కార్యక్రమానికి తవ్వుతున్న గుంతలను పరిశీలించారు. 30 సెంటి మీటర్లకు పైబడి ఉన్న మొక్కలను నాటాడానికి వీలుగా, ప్రతి గుంత 45 క్యూబిక్ సెంటిమీటర్ల లోతుకు తగ్గకుండా చూసుకోవాలని పేర్కోన్నారు. పల్లెప్రకృతి వనంలో నాటిన మొక్కలను సంరక్షించాలని, వాటికి క్రమంతప్పకుండా నీరు పోసి కాపాడుకోవాల్సిన బాద్యత అందరిపై ఉందని, వైకుంఠదామాల నిర్మాణాలను, పల్లెప్రగతి పనులను సకాలంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చల్గల్ గ్రామంలో బైపాస్ రోడ్డుకు ఇరువైపులా, అంబారిపేట గ్రామంలోని ఎస్.ఆర్.ఎస్.పి మెయిన్ కెనాల్ కట్ట వద్ద, రాయికల్ మండలం అల్లీపుర్ గ్రామ శివార లోనీ కెనాల్ డంపింగ్ యార్డు వద్ద ఆనుకొని చేపడుతున్న గుంతలు తవ్వె కార్యక్రమాన్ని పరిశీలించారు. అదేవిధంగా అంబారి పేటలో నిర్మిస్తున్న వైకుంఠ దామాల, పల్లె ప్రగతి పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఏపిడి సంధ్యారాణి, డిఆర్డిఓ కార్యాలయం, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, సర్పంచులు, ఎంపీవోలు ఇతర అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here